logo
జాతీయం

రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు...ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే..

రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు...ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే..
X
Highlights

యోగా గురు రాందేవ్ బాబా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనే వారికి ఓటు హక్కు...

యోగా గురు రాందేవ్ బాబా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనే వారికి ఓటు హక్కు రద్దు చేయాలని వ్యాఖ్యానించారు. పెళ్లి చేసుకున్న వారికంటే తనలా బ్రహ్మచారులుగా ఉండిపోయిన వారికే ఎక్కువ గౌరవం ఉండాలని అన్నారు. బ్రహ్మచర్యం, దాని గొప్పదనం గురించి పలుమార్లు ప్రస్తావించిన బాబా రామ్‌దేవ్... పెళ్లి చేసుకునేవారికి కష్టాలు తప్పవనే అర్థం వచ్చేలా మాట్లాడి వార్తల్లో నిలిచారు. ఆదివారం హరిద్వార్‌లోని తన ఆశ్రమంలో సహచరులను ఉద్దేశించి బాబా రాందేవ్ ఈ వాఖ్యలు చేశారు. కొన్ని సందర్భాల్లో పది మంది సంతానాన్ని కనేందుకు సైతం మన వేదాలు అనుమతించాయని, ఇప్పటికే దేశ జనాభా 125 కోట్లు దాటిన క్రమంలో ప్రస్తుతం అధిక సంతానం మనకు అవసరం లేదన్నారు. భార్యా పిల్లలు లేకుండా తాము ఎంత సుఖంగా ఉంటామో చూడాలని రాందేవ్‌ చమత్కరించారు.

Next Story