రేణుకు తోడు దొరికినట్లేనా? ఆసక్తి రేపుతున్న ఫొటో!

రేణుకు తోడు దొరికినట్లేనా? ఆసక్తి రేపుతున్న ఫొటో!
x
Highlights

నటి రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నారని, ఆమెకు సరైన భాగస్వామి దొరికినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలో రేణూ దేశాయ్ చేసిన ఓ పోస్ట్...

నటి రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నారని, ఆమెకు సరైన భాగస్వామి దొరికినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలో రేణూ దేశాయ్ చేసిన ఓ పోస్ట్ ఆసక్తి కరంగా ఉంది. రేణూ దేశాయ్ తాను చెప్పదలచుకున్న విషయాన్ని కవితాత్మక ధోరణిలో తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పొందుపరిచారు. ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్‌ చేశారు. దానికింద ఆమె ఓ కవిత కూడా రాశారు... ‘నా ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికా. ఆ ప్రయాణంలో ప్రేమ అనేది ఓ అనుభూతి అన్న సంగతినే మర్చిపోయా. ‘నీలో నా ప్రేమ దొరికింది’ అంటూ ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని వర్ణించారు. ‘నీతో ఉంటే చాలా సంతోషంగా, శాంతంగా ఉంటాను. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ విడువకు. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు’ అంటూ ఆమె కవితలో తన భావాల్ని రాశారు. దీంతో ఆమెకు కావాల్సిన తోడు దొరికిందా? ఆమె కాబోయే భర్తే అతనేనా? అన్న చర్చ మొదలైంది. మరోవైపు చాలా మంది ఈ కోణంలోనే కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై రేణూ దేశాయ్‌ మాత్రం స్పందించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories