పంచాయతీ సెక్రటరీ నియామకాలపై హైకోర్టు సీరియస్‌

పంచాయతీ సెక్రటరీ నియామకాలపై హైకోర్టు సీరియస్‌
x
Highlights

తెలంగాణలో 9355 జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పోస్టుల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించందంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. పంచాయతీ...

తెలంగాణలో 9355 జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పోస్టుల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించందంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు సంబంధించి ప్రాథమిక కి పై 70 వేల మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. పోస్టుల నియామకంలో అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఖమ్మం జిల్లాకు చెందిన బి.హరీష్ కుమార్ తో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ నియామకాల్లో స్పోర్ట్స్‌, వికలాంగుల కోటాని విస్మరించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. 95 శాతం స్పోర్ట్స్‌, వికలాంగుల వాటా సరి చేసిన తర్వాతే మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ సెక్రటరీ నియామకాలపై స్టే ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన వి​జ్ఞప్తిని తోసిపుచ్చింది. ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులపై, 14 ప్రశ్నలను తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో ఇవ్వడంపై కూడా పూర్తి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చేసిన తప్పులను ఒప్పుకోకుండా ఎందుకు మేనేజ్‌ చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా నియామక పత్రాలను ఇవ్వవద్దని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories