టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అకౌంట్‌లో డబ్బులు వేస్తామంటూ...

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అకౌంట్‌లో డబ్బులు వేస్తామంటూ...
x
Highlights

ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్ ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క, స్థానిక టీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట...

ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్ ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క, స్థానిక టీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ భట్టి విక్రమార్క ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌కు పోటీగా టీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరువర్గాలను అదుపు చేయడానికి పోలీసులు భారీగా మోహరించారు. టీఆర్ఎస్‌ కార్యకర్తలు ఓటర్ల నుంచి ఆధార్ కార్డుల జిరాక్స్‌లు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారంటూ ఆదివారం ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు ముదిగొండ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆధార్ జిరాక్స్‌లు, ఫోన్ నెంబర్లు సేకరిస్తున్న వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, సాయంత్రం సువర్ణాపురంలో జరిగిన మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క సభలో ఆ వ్యక్తి మళ్లీ కనిపించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులు అధికార పార్టీకి చెప్పుచేతల్లో పనిచేస్తున్నారంటూ భట్టి విక్రమార్కతో సహా కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ సమాచారం తెలిసి.. టీఆర్ఎస్ నేత లింగాల కమల్ రాజ్ కూడా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి కార్యకర్తలతో కలిసి బైఠాయించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. పార్టీల అనుకూల నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఐటీబీపీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను చెల్లచెదురు చేసేందుకు లాఠీలకు పనిచెప్పారు. పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories