తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
x
Highlights

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యేక అధికారులతో పంచాయతిల్లో పాలన సాగిస్తున్న తీరును హైకోర్టు తీవ్ర స్ధాయిలో తప్పుబట్టింది....

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యేక అధికారులతో పంచాయతిల్లో పాలన సాగిస్తున్న తీరును హైకోర్టు తీవ్ర స్ధాయిలో తప్పుబట్టింది. రాజ్యాంగ విరుద్ధంగా పాలన ఎలా నిర్వహిస్తారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పదవి కాలం ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహింకుండా ప్రత్యేక జీవో ఎందుకివ్వాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ఎట్టి పరిస్ధితుల్లోనూ మూడు నెలల లోపు పంచాయతి ఎన్నికలు నిర్వహించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక అధికారుల పాలనను రద్దు చేయాలంటూ గతంలో దాఖలైన పిటిషన్లపై కోర్టు నేడు తీర్పు వెలువరించింది. పంచాయతి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కూడా హైకోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories