అఖిల్ "హలో"టీజర్ ని బ్లాక్ చేసిన యూట్యూబ్

Highlights

అక్కినేని అఖిల్ నటించిన "హలో" సినిమా చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. విక్రం కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు....

అక్కినేని అఖిల్ నటించిన "హలో" సినిమా చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. విక్రం కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాకు చెందిన టీజర్ ను ఆ చిత్ర యూనిట్ కొద్దిరోజుల క్రితం విడుదల చేసింది. ఈ టీజర్ కు చెందిన మ్యూజిక్ ను హలో టీం వాడుకున్నట్లు ఓ మ్యూజిక్ డైరక్టర్ యూట్యూబ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో యూట్యూబ్ హలో టీజర్ ను తొలగించింది. ఈ విషయం తెలుసుకున్న చిత్ర బృందంలోని సభ్యులు షాక్ కి గురయ్యారు.

అంతేకాదు ఈ చిత్రానికి మ్యూజిక్ డైరక్టర్ గా ఉన్న అనూప్ రూబెన్స్ మాట్లాడుతు తాను ఆ మ్యూజిక్ ని ముందే కొనుగోలు చేసానని, కాబట్టి టీజర్ వీడియో కి వాడానని చెప్పుకొచ్చారు. కాని, యుట్యూబ్ మాత్రం అనూప్ మ్యూజిక్ కి సంబంధించి పూర్తీ పత్రాలను తమకు పంపించిన తర్వాతే టీజర్ ని తిరిగి అనుమతిస్తామని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories