logo
సినిమా

బిగ్ బాస్2 లో ఎంట్రీ... హెబ్బా పటేల్ క్లారిటీ

బిగ్ బాస్2 లో ఎంట్రీ... హెబ్బా పటేల్ క్లారిటీ
X
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 మొదలయ్యి ఐదు వారాలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఐదవ వారంలో భానుశ్రీ షో నుండి ఎలిమినేట్ అయింది. ...

బిగ్ బాస్ సీజన్ 2 మొదలయ్యి ఐదు వారాలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఐదవ వారంలో భానుశ్రీ షో నుండి ఎలిమినేట్ అయింది. అయితే ఈ షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ రానుందనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. సీజన్ 1లో నవదీప్, దీక్షా పంత్ లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అలానే హెబ్బా కూడా రానుందని కథనాలు ప్రచురించారు. ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది హెబ్బా పటేల్. "నేను మా ఇంట్లోనే వున్నా .. మరే ఇంట్లో లేను .. ఏ రియాలిటీ షోలో పాల్గొనడం లేదు" అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఇలా 'బిగ్ బాస్ హౌస్'లోకి తాను ఎంట్రీ ఇస్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారానికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టేసింది.

Next Story