మావోల దాడి...కంటతడి పెట్టిస్తున్న దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ చివరి మాటలు

ఛత్తీస్‌గఢ్‌లో నిన్నటి మావోయిస్ట దాడికి సంబంధించి కీలక వీడియో బయటపడింది. మావోయిస్టుల దాడిలో చనిపోయిన డీడీ...
ఛత్తీస్‌గఢ్‌లో నిన్నటి మావోయిస్ట దాడికి సంబంధించి కీలక వీడియో బయటపడింది. మావోయిస్టుల దాడిలో చనిపోయిన డీడీ న్యూస్ కెమెరామెన్... కాల్పుల సమయంలో తన తల్లితో వీడియో కాల్ మాట్లాడాడు. మావోయిస్టులు దాడి చేశారని... ఇక్కడి పరిస్ధితులను బట్టి చూస్తే తాను చనిపోతానేమోనన్న భయంగా ఉందని తన తల్లితో చెప్పాడు. అప్పటికే మావోయిస్టుల దాడిలో గాయపడిన కెమెరామెన్ అచ్యుతానంద సాహూ... తన తల్లితో మాట్లాడిన చివరి మాటలు అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి. తమపై దాడి జరిగిన విషయాన్ని చెబుతూ ఆయన తన సందేశాన్ని మొదలుపెట్టారు. ‘‘ఎన్నికల కవరేజీ కోసం నేను దంతేవాడ వచ్చాను. మేము రోడ్డుమార్గంలో వెళ్తున్నాం. మాతో పాటు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఇంతలోనే ఒక్కసారిగా నక్సలైట్లు మమ్మల్ని చుట్టుముట్టారు..’’ అని శర్మ వివరించారు. ‘‘అమ్మా, ఐ లవ్ యూ... ఈ దాడిలో నేను చనిపోతానేమో,’’ అంటూ ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. అయితే చావంటే తనకు భయం లేదని పేర్కొన్నారు. ‘‘ఎందుకో తెలియదు. మృత్యువు ముందున్నా నాకు భయంగా లేదు. నేను బయటపడేలా కనిపించడం లేదు. మాకు రక్షణగా కొంతమంది జవాన్లు ఉన్నప్పటికీ... నక్సలైట్లు అన్ని దిక్కుల నుండి మమ్మల్ని చుట్టుముట్టారు. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను..’’ అంటూ శర్మ తన సందేశాన్ని ముగించారు.
As the Police and Doordarshan team came under attack from Naxals, DD assistant cameraman recorded a message for his mother. pic.twitter.com/DwpjsT3klt
— Rahul Pandita (@rahulpandita) October 31, 2018
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం
14 Aug 2022 12:01 PM GMTCIBIL Score: పర్సనల్ లోన్‌కి అర్హులా కాదా అంటే సిబిల్ స్కోరు...
14 Aug 2022 11:30 AM GMTBandi Sanjay: ఆలేరు నియోజకవర్గం తుర్కల షాపూర్లో ప్రజాసంగ్రామ యాత్ర
14 Aug 2022 11:27 AM GMTవైసీపీ ప్రభుత్వ అసమర్థ పనితీరు వల్లే...రాష్ట్రానికి పెట్టుబడులు రావడం...
14 Aug 2022 11:05 AM GMTStress: ఈ లక్షణాలు కనిపిస్తే తీవ్రమైన ఒత్తిడి.. ఎలా బయటపడాలంటే..?
14 Aug 2022 10:30 AM GMT