7 నుంచి 12వ తరగతి చదువుతున్న వారికి హెల్త్‌కిట్స్: మంత్రి కడియం

7 నుంచి 12వ తరగతి చదువుతున్న వారికి హెల్త్‌కిట్స్: మంత్రి కడియం
x
Highlights

ఈ ఏడాది నుంచే 84 చోట్ల జూనియర్‌ కాలేజీలను ప్రారంభిస్తున్నామని విద్యాశాఖ మంత్రి కడియంశ్రీహరి అన్నారు. ఉపాధ్యాయుల బదిలీల వెబ్‌సైట్‌ను ప్రారంభించిన...

ఈ ఏడాది నుంచే 84 చోట్ల జూనియర్‌ కాలేజీలను ప్రారంభిస్తున్నామని విద్యాశాఖ మంత్రి కడియంశ్రీహరి అన్నారు. ఉపాధ్యాయుల బదిలీల వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కడియం... 84 కేజీబీవీలను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామన్నారు. విద్యార్థులు శారీరక, మానసిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని.. అన్ని హాస్టళ్లలో ఒకే రకమైన మెనూను అమలు చేస్తున్నామన్నారు. అంతే కాక 7వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆరోగ్య కిట్‌లు అందిస్తామన్నారు. ఉపాధ్యాయ నిమామకాలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిర్ణయం తీసుకోగానే కాంగ్రెస్ వారే కోర్టులో కేసులు వేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చిల్లరగా వ్యవహరిస్తున్నారు. అసహనంతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకున్నాం. ఆ వివరాలు కోర్టుకు అందజేశాం. ఫీజులు నియంత్రించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories