logo
సినిమా

మీటూ : బలవంతంగా దుస్తులు తొలగించి..

మీటూ : బలవంతంగా దుస్తులు తొలగించి..
X
Highlights

దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కరిగా నటీమణులు తాము ఎదుర్కొన్న...

దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కరిగా నటీమణులు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడిస్తున్నారు. అయితే కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టీవీ నటి సొనాల్‌ వెంగురేల్కర్‌ పరిశ్రమలో గతంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వెల్లడించారు. తాను పరిశ్రమలోకి రాకమునుపు 19 ఏళ్ల వయసులో ఫొటోగ్రాఫర్‌, క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ రాజ బజాజ్‌ తన పట్ల అసభ్యంగా వ్యవహరించాడని ఆరోపించారు. తాను తాం‍త్రిక విద్యలు నేర్పుతానని, వాటితో రాత్రికి రాత్రే విజేతలవుతారని మభ్యపెడుతూ తన దుస్తులను తొలగించేందుకు ప్రయత్నించాడని, బలవంతంగా తన ఛాతీపై క్రీమ్‌ను రాశాడని చెప్పారు. కాగా ఓ ఆన్ లైన్ పోర్టల్ లో ఆడిషన్ అవకాశం చూసి రాజ బజాజ్ ను సంప్రదించాల్సి వచ్చింది ఆ సమయంలో నాకు ఈ చేదు అనుభవం ఎదురైంది’ అంటూ వెల్లడించారు. రాజ తీరుకు షాక్‌కు గురైన తాను 2012లోనే కస్తూర్బా మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పారు. అయితే ఈ విషయంపై స్పందించిన రాజ బజాజ్ ఆమె ఆరోపణలని తోసిపుచ్చారు. సొనాల్ తన ఇంటికి వచ్చి మూడు లక్షలు డిమాండ్ చేసిందని, ఆ తరువాత లక్షన్నర కి దిగివచ్చిందని దానికి ఒప్పుకోకపోవడంతో ఆమె ఈ విధమైన ఆరోపణలు చేస్తుందని అన్నారు.

Next Story