Top
logo

హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

X
Highlights

తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆదరణ ఉన్నప్పుడే రాజకీయాల్లో నుంచి వైదొలగాలని అన్నారు....

తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆదరణ ఉన్నప్పుడే రాజకీయాల్లో నుంచి వైదొలగాలని అన్నారు. ఇబ్రహీంపూర్ సభలో పాల్గొన్న హరీష్‌ రావ్ అక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందని వ్యాఖ్యానించారు. ఇక రాజకీయాలు చాలనిపిస్తోందన్నారు హరీష్. ఇబ్రహీంపూర్‌ గ్రామ ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత హరీశ్‌రావుకే ఓటు వేస్తామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపూర్ గ్రామం చరిత్ర పుటల్లో మరోసారి నిలిచిందని కొనియాడారు. ప్రజల ప్రేమతో ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటే బాగుండునని అనిపిస్తోందని ఆయన అన్నారు. ఎన్ని జన్మలెత్తినా ప్రజల రుణం తీర్చుకోలేనిదని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రాజకీయాలలో ఉన్నా.. లేకున్నా మీ రుణం తీర్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు.

Next Story