Top
logo

హరీష్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం

X
Highlights

సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. హరీష్ రాక సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు బాణా ...

సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. హరీష్ రాక సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు బాణా సంచా కాల్చడంతో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయపడిన కార్యకర్తలు వాహనాలను వదిలేసి పారిపోయారు. హరీష్ మాత్రం పొగల్లో చిక్కుకుని కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. మంత్రిని మంటలు, పొగ చుట్టుముట్టడంతో ఆంతా కంగారు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ముగ్గురు గన్‌మెన్లు వచ్చి ఆయనకు రక్షణగా నిలిచారు. అనంతరం మంత్రిని అక్కడి నుంచి తరలించారు.

Next Story