Top
logo

పేదలకు డబ్బులు పంచి ..నవ్వుతూ ఉరికొయ్యను ముద్దాడిన ధీశాలి

Highlights

ఉరికొయ్యను ముద్దాడిన ధీశాలి ఎంత దైర్యవంతుడైనా మృత్యువు సంభవిస్తుందంటే చిగురుటాకులా వణికిపోతాడు. కానీ ఓ...

ఉరికొయ్యను ముద్దాడిన ధీశాలి

ఎంత దైర్యవంతుడైనా మృత్యువు సంభవిస్తుందంటే చిగురుటాకులా వణికిపోతాడు. కానీ ఓ యువకుడు మాత్రం చావును కూడా చిరునవ్వుతో ఆహ్వానిస్తూ ఉరికొయ్యను ముద్దాడాడు. ఈ హ్యాకర్ అమెరికాకు చెందిన బ్యాంకుల్లో భారీ మొత్తంలో డబ్బును దోచుకున్నాడు. దోచుకున్నడబ్బును ఒక్కరూపాయి కూడా ఇతడు ఖర్చుపెట్టకోలేదు. స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చాడు. ఎట్టకేలకు ఇతడ్ని పట్టుకున్న పోలీసులకు ఒట్టి చేతులు చూపించాడు. దోచుకున్న డబ్బులో ఒక్కరూపాయి కూడా వాడుకోలేదని చెప్పడంతో అమెరికా పోలీసులు అతడికి ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే ఉరికొయ్య ఎక్కి కూడా ఏదో ఊరికి వెళుతూ టాటా చెప్పినట్లు జైలు సిబ్బందికి గుడ్ బై చెప్పి ఆనందంగా కన్నుమూశాడు. చనిపోయే ముందు తాను చేసిన పనికి చాలామంది ఆనందంగా ఉన్నారని అందుకే తాను కూడా ఉరిశిక్షను ఆనందంగా స్వీకరిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

అల్జీరియన్ హ్యకర్ హంజా బెండలార్జ్

అల్జీరియన్ హ్యకర్ హంజా బెండలార్జ్(24). కిక్ సినిమాలో రవితేజలా రిస్క్‌లో కిక్కును వెతుకున్నాడు. అంతే ఆలోచన వచ్చిందే తడువుగా హ్యాకింగ్ లో మొనగాడైన ఇతగాడు బ్యాంకులకు టోకరా వేసి మిలియన్ డాలర్లను దోచుకున్నాడు. ఆ డబ్బుతో జల్సా చేయలేదు... ఎంజాయ్‌ చేయలేదు. దోచుకున్న డబ్బును పేదలకు పంచాలని నిర్ణయించుకున్నాడు.
అలా కోట్లాది రూపాయలను ఛారిటబుల్ ట్రస్ట్‌లకు విరాళంగా ఇచ్చేశాడు. తర్వాత తన ప్రాణాలను తృణప్రాయంగా ఉరికంభం ఎక్కాడు. అయినా తాను చేసిన పనికి మనస్పూర్తిగా నవ్వుతూ అంపశయ్యపై ధీశాలిగా నిలిచాడు. వినడానికి వింతగా, చూడ్డానికి ఆశ్చర్యంగా అనిపించినా ఆధునిక యుగంలో పేదలకు సహాయం చేయాలన్న తన సహృదయంతో అందరి మన్ననలను పొందాడు.

స్పైఈ వైరస్

స్పైఈ అనే వైరస్ కు బీఎక్స్ వన్ అనే కోడ్ ను జతచేసి సిమ్లింగ్ హ్యాకర్ అనే మారుపేరుతో దేశ వ్యాప్తంగా ఉన్న 1.4 మిలియన్ కంప్యూటర్ లలో, అమెరికాకు చెందిన 217 బ్యాంకుల్లో ఆ వైరస్ ను వ్యాపింప చేసినట్లు యూఎస్ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన టెక్నాలజీ మ్యాగజైన్ "వైర్డ్" కథనాల్ని ప్రచురించింది.

ఆ వైరస్ ను కంప్యూటర్లలోకి పంపిన విధానం

బెండలార్జ్ తయారు చేసిన వైరస్ ను బాట్ నెట్ అనే కంప్యూటర్ డివైజ్ తో డీడీఓఎస్ అటాక్ denial-of-service attack (DDoS attack) తో అనుసందానం చేశాడు. అనంతరం ఆ డివైజ్ లో టార్గెట్ డేటాను అప్ డేట్ చేసి వైరస్ ను పంపించాడు. దీంతో ఆ వైరస్ కంప్యూటర్లలోకి చొరబడి ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఐడీ , పాస్ వర్డ్ , వ్యక్తిగత వివరాలను సేకరించింది. అలా సేకరించిన వివరాల ఆధారంగా బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసి వాటిలో ఉన్న డబ్బును హ్యాకర్ తన వ్యక్తిగత అకౌంట్ లోకి మళ్లించుకున్నాడు.

బ్యాంకులకు టోకరా వేసిన మొత్తం

అలా 2009 నుంచి 20011 వైరస్ తో $280,000 మిలియన్ డాలర్లను దొంగిలించాడు. ఆ సొమ్మును ఖర్చుచేయకుండా పాలస్తీనా, ఆఫ్రికా దేశాల్లోని పేదలకు, ఛారిటబుల్ ట్రస్టులకు దానంగా ఇచ్చాడు.

హ్యాకర్ పై కేసు నమోదు

యూఎస్ కు చెందిన అన్నీ ప్రభుత్వ ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన అవకతవకలు జరుగుతున్నాయంటూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆ దేశ ప్రభుత్వం డిసెంబర్ 20,2011న బ్యాంకులను మోసం చేసినందుకుగాను 20ఏళ్లు జైలు శిక్ష, మరోపదేళ్లు ప్రభుత్వ కంప్యూటర్లను హ్యాక్ చేసినందుకు 10ఏళ్లు జైలు శిక్ష, అపరాద రుసుం కింద 91కోట్ల, 14లక్షల చెల్లించేలా కేసు నమోదు చేశారు. ఈ కేసును యూఎస్ కు చెందిన నార్తన్ డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ జడ్జ్ జానెట్ ఎఫ్. కింగ్ నేతృత్వంలో విచారణ ప్రారంభించారు.

బ్యాంకాక్ పోలీసుల అదుపులో బెండలార్జ్

అయితే ఈ కేసు విచారణలో ఉండగా సమాచారం అందుకున్న హ్యకర్ అల్జీరియన్ నుంచి పారిపోయి థాయ్ ల్యాండ్ లో తలదాచుకున్నాడు. అప్పటికే బెండలార్జ్ కోసం వెతుకున్న థాయ్ ల్యాండ్ పోలీసులు 2013లో అదుపులోకి తీసుకొని అమెరికాకు తరలించారు.

ఉరిశిక్ష వేసినట్లు వచ్చిన వార్తలు

అమెరికాలో బెండలార్జ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసుపై విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా హ్యాకర్ పోలీసులకు ఒట్టి చేతులు చూపించాడు. దోచుకున్న డబ్బులో ఒక్కరూపాయి కూడా వాడుకోలేదని ..ఆ పెద్దమొత్తాన్ని స్వచ్చంద సంస్థలకు, పేదలకు ఇచ్చానని చెప్పడంతో అమెరికా పోలీసులు అతడికి ఉరిశిక్ష ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు అతణ్ని ఉరితీసినట్లు కొన్నిఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

హంజా మరణంపై వివరణ

హ్యాకర్ హంజాను ఉరితీశాడనే వార్తలు అల్జిరీయా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేశాయి. దీంతో ఆయన మద్దతుదారులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. యూనైటెడ్ కుర్ధీష్ హ్యాకర్ టీం క్యాంపెయిన్ నిర్వహించింది. దీనిపై స్పందించిన అల్జీరియా మంత్రిత్వ శాఖ కంప్యూటర్ నేరాలు కాదు మరణార్హనేరాలైన వారికి ఉరిశిక్ష విధిస్తారని ట్విట్ చేసింది.

Next Story