ప్రేయసి కోసం వెళ్లి ..పాక్‌లో ఇరుక్కున్న హమీద్‌...వీర్‌ జారా మూవీని తలపించేలా హమీద్‌ ప్రేమకథ

ప్రేయసి కోసం వెళ్లి ..పాక్‌లో ఇరుక్కున్న హమీద్‌...వీర్‌ జారా మూవీని తలపించేలా హమీద్‌ ప్రేమకథ
x
Highlights

బాలీవుడ్‌ హిట్‌ సినిమా వీర్ జారా స్టోరీ గుర్తుందా? హీరో షారుఖ్‌ ఖాన్‌ తన ప్రియురాలు ప్రీతిజింతా కోసం పాకిస్తాన్ వెళ్లి జైలుపాలవుతాడు. సేమ్‌ టు సేమ్‌...

బాలీవుడ్‌ హిట్‌ సినిమా వీర్ జారా స్టోరీ గుర్తుందా? హీరో షారుఖ్‌ ఖాన్‌ తన ప్రియురాలు ప్రీతిజింతా కోసం పాకిస్తాన్ వెళ్లి జైలుపాలవుతాడు. సేమ్‌ టు సేమ్‌ ఇదే స్టోరీ రియల్‌ లైఫ్‌లో జరిగింది. ముంబైలో ఓ యువకుడు తన ప్రేమ కోసం ఎల్లలు దాటాడు శత్రుదేశం అని తెలిసినా అడ్డదారిలో అడుగుపెట్టాడు ప్రేయసి జాడ కోసం అన్వేషిస్తూ అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. గూఢచర్యం నెపంపై ఆ ప్రేమికుడికి అక్కడి సైనిక న్యాయస్థానం మూడేళ్ల విచారణ అనంతరం 36 నెలల జైలు శిక్ష విధించింది. ఇది సినిమా కథ కాదు అచ్చం వీర్‌ జారా మూవీ స్టైల్లో జరిగిన రియల్‌ లవ్‌ స్టోరీ. ఫేస్‌బుక్‌ ప్రేమను నమ్మి పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడి సైన్యానికి పట్టుబడి ఇటీవల విడుదలైన ప్రేమ ఖైదీ హమీద్‌ నేహాల్‌ అన్సారీ రియల్‌ స్టోరీ.

హమీద్‌ నేహాల్‌ అన్సారీ సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌. తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ముంబైలో నివసిస్తోన్న అన్సారీ కుటుంబంలో ఫేస్‌‌బుక్‌ ప్రేమ పెను ప్రకంపనలు సృష్టించింది. పాకిస్థానీ యువతితో ఫేస్‌‌బుక్‌ ద్వారా ప్రేమలోపడ్డ హమీద్‌ నేహాల్‌ అన్సారీ ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తెలుసుకొని శత్రుదేశంలో అడుగుపెట్టాడు. అఫ్ఘనిస్తాన్‌లో ఉద్యోగమంటూ తల్లిదండ్రులకు చెప్పి కాబూల్‌ వెళ్లిన హమీద్‌ నేహాల్‌ అన్సారీ అక్కడ్నుంచి నకిలీ ధృవపత్రాలతో రోడ్డు మార్గం ద్వారా పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడు. నేహాల్‌ హమాజ్‌ పేరుతో నకిలీ గుర్తింపు కార్డు సృష్టించుకుని ప్రేయసిని వెతుక్కుంటూ కొహాట్‌కు చేరుకున్నాడు. అయితే ప్రియురాలి జాడ కోసం వెతుకుతున్న సమయంలో అక్కడి పోలీసులకు దొరికిపోయాడు. భారతీయ యువకుడు కావడంతో హమీద్‌ నేహాల్‌ అన్సారీ వాదనను పట్టించుకోని పోలీసులు గూఢచర్యం నేరం మోపారు. అయితే సరిహద్దుల ఆవల కన్నపేగు తరుక్కుపోయింది. ఉద్యోగం కోసం కాబుల్‌ వెళ్లిన తన కొడుకు మూడేళ్లైనా తిరిగి రాకపోవడంతో అతని తల్లి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసింది. దాంతో స్పందించిన పాక్ హమీద్‌ గూఢచర్యం నేరంపై తమ అదుపులో ఉన్నాడని తెలిపింది. ఆ తర్వాత కొద్దిరోజులకే 2015 డిసెంబర్‌లో నేహాల్‌కు పాక్‌ న్యాయస్థాన్‌ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. పెషావర్‌లోని మర్దాని జైల్లో హమీద్‌ నేహాల్‌ మూడేళ్లపాటు శిక్ష అనుభవించాడు.

Hamid Nehal Ansari Says Dont Want To Blame Anybody For His Fault - Sakshi

కుటుంబ సభ్యులు, భారత ప్రభుత్వం చేసిన ఎన్నో ప్రయత్నాల తర్వాత పాకిస్తాన్‌ జైలు నుంచి విడుదలై ఆరేళ్ల తర్వాత వాఘా బోర్డర్ దాటి స్వదేశంలోకి అడుగుపెట్టాడు. వేయికళ్లతో ఎదురుచూస్తున్న తన తల్లిదండ్రుల్ని కలుసుకున్నాడు. ఆరేళ్ల తర్వాత కన్నబిడ్డ కళ్లెదుట ప్రత్యక్షం కావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవు. ఆరేళ్ల తర్వాత పాక్‌ జైలు నుంచి రిలీజై స్వదేశంలో అడుగుపెట్టిన హమీద్‌ నేహాల్‌ అన్సారీ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు మళ్లీ నా దేశంలో నా వాళ్ల మధ్య నా ఇంట్లో ఉన్నానంటూ అన్సారీ పట్టలేని సంతోషాన్ని వ్యక్తంచేశాడు. తనను స్వదేశానికి రప్పించేందుకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాడు. తన ఉద్దేశం మంచిదే అయినా, వేసింది తప్పటడుగు, అందుకు మూల్యం చెల్లించుకున్నానంటూ తన లవ్‌ స్టోరీ గుర్తుచేసుకున్నాడు హమీద్‌ నేహాల్‌ అన్సారీ.

బాలీవుడ్‌ హిట్‌ సినిమా వీర్ జారా స్టోరీని తలపించేలా సాగిన హమీద్‌ నేహాల్‌ అన్సారీ జైలు కథ దాని వెనుకున్న రియల్‌ స్టోరీని తెలుసుకున్న పాకిస్తానీ జర్నలిస్ట్ కథనాలు రాయడంతో అన్సారీ కేసు తెరపైకి వచ్చింది. ప్రపంచానికి హమీద్ లవ్ స్టోరీ తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories