ఉగ్రవాదికి పాక్ ప్రజలు పట్టం కట్టబెడతారా

Highlights

ముంబై 26 బై లెవన్ సూత్రధారి హఫీజ్‌ సయీద్‌, పాకిస్తాన్ ‌రాజకీయాల్లోకి వస్తున్నాడు... ఉగ్ర సంస్థలను శాసిస్తున్న నరహంతకుడు పాలిటికల్‌ పవర్‌ కోసం అర్రులు...

ముంబై 26 బై లెవన్ సూత్రధారి హఫీజ్‌ సయీద్‌, పాకిస్తాన్ ‌రాజకీయాల్లోకి వస్తున్నాడు...
ఉగ్ర సంస్థలను శాసిస్తున్న నరహంతకుడు పాలిటికల్‌ పవర్‌ కోసం అర్రులు చాస్తున్నాడు..
ఇండియాలో విధ్వంసమే లక్ష్యంగా ప్రణాళికలు వేసే ఉగ్రవాది దేశాధినేతగా ఎదిగేందుకు ప్లాన్‌ వేస్తున్నాడు..
కాశ్మీరు కల్లోలానికి యువత చేతుల్లో రాళ్లు, తుపాకులు పెడుతున్న లష్కరే తొయిబా చీఫ్‌, చట్టసభల్లోకి ఎంట్రీ కావడానికి ప్రయత్నం మొదలెట్టాడు.
2018 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు సయీద్ ప్రకటన
అవును. మీరు విన్నది నిజమే. గతకొంతకాలంగా రాజకీయాల్లోకి వస్తానంటూ, సంకేతాలు పంపుతున్న జమాత్‌ ఉద్‌ దవా వ్యవస్థాపకుడు, లష్కరే తొయిబా అధినేత హఫీజ్ సయీద్‌, పాకిస్తాన్‌ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం కన్‌‌ఫాం అయ్యింది. పాకిస్థాన్‌లో 2018 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించాడు సయీద్.
మొన్ననే పలు కేసుల కింద హౌస్ అరెస్ట్ అయి, విడుదలయ్యాడు హఫీజ్ సయీద్. వెనువెంటనే ఇస్లామాబాద్‌లో కల్లోలం రేపాడు. న్యాయమంత్రి జహిద్ హమిద్ దైవదూషణకు పాల్పడ్డాడని, మంత్రిని తప్పించాలంటూ సయీద్ మద్దతుదారులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారు. దీంతో సైన్యం రంగ ప్రవేశం చేసి, ఇస్లామాబాద్‌ను కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. ఇప్పటికీ పాకిస్తాన్‌లో అన్ని మత సంస్థలూ హఫీజ్‌ సయీద్‌ అధీనంలోనే ఉన్నాయి. ఇప్పుుడు ఇదే బలంతో రాజకీయాలను శాసించాలనుకుంటున్నాడు సయీద్.
హఫీజ్‌ సయీద్‌ స్థాపించిన పార్టీ పేరు మిల్లీ ముస్లిం లీగ్‌. ఎన్నికల కమిషన్‌లో ఇప్పటివరకైతే రిజిస్టర్ కాలేదు. అయితే వచ్చే ఏడాది మిల్లీ ముస్లిం లీగ్ పోటీ చేస్తుందని, తాను కూడా రంగంలోకి దిగుతానని ప్రకటించాడు హఫీజ్ సయీద్. ఇప్పటివరకైతే, పాకిస్తాన్‌లో అసిఫ్‌ అలీ జర్దారి నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, నవాజ్‌ షరీఫ్‌ పాకిస్తాన్ ముస్లింలీగ్‌, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, మరో ఐదారు చిన్నా చితకా పార్టీలున్నాయి. మరి పాతుకుపోయిన ఈ పార్టీలను కాదని జనం హఫీజ్‌ సయీద్‌ లాంటి ఉగ్రవాదికి పట్టం కడతారా.

Show Full Article
Print Article
Next Story
More Stories