logo
జాతీయం

గుజరాత్‌లో విద్యుత్‌ బకాయిల మాఫీ

గుజరాత్‌లో విద్యుత్‌ బకాయిల మాఫీ
X
Highlights

ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా రేపరేపలాడిన విషయం తెలిసిందే కాగా మూడు...

ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా రేపరేపలాడిన విషయం తెలిసిందే కాగా మూడు రాష్ట్రాలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి కొద్ది గంటలకే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో రైతులకు రుణ మాఫీని ప్రకటించింది కాంగ్రెస్. అయితే ఇదే తరహాలో బీజేపీ సారథ్యంలోని గుజరాత్ సర్కార్ కూడా రూ. 650కోట్ల దాకా కరెంట్ బిల్లులను మాఫీ చేస్తున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు బకాయి పడిన కరెంట్ బిల్లుల మాఫీపై గుజరాత్ సర్కార్ ప్రకటన వెలువరించింది. పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లుల మాఫీతో రూ. 650 కోట్ల మేర ప్రజలు లబ్ధి పొందుతారని గుజరాత్‌ విద్యుత్‌ శాఖ మంత్రి సౌరభ్‌ పటేల్‌ తెలిపారు.

Next Story