కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి

ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో విషాదం నెలకొన్నది. ఆరంతస్తుల భవనం అర్థరాత్రి కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న ...
ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో విషాదం నెలకొన్నది. ఆరంతస్తుల భవనం అర్థరాత్రి కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనంపై పడింది. దాంతో ఈ రెండు భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింది నుంచి మూడు మృతదేహాలను వెలికి తీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎప్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
గ్రేటర్ నొయిడాలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి పక్కనే ఉన్న మరో భవనంపై పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మొదట నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కూలి పక్కనే నాలుగంతస్తుల బిల్డింగ్‌పై పడింది. నాల్గంతస్తుల భవనంలో మొత్తం 18 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
భవనాలు కుప్పకూలినట్లు సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. స్థానిక పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి శిధిలాలు తొలగింపచేశారు. భవన శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తమకు సహాయం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. నాణ్యతాపరమైన లోపాల వల్లే భవనం కుప్పకూలి ఉంటుందని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Invest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMTRajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
12 Aug 2022 1:00 PM GMTమునుగోడులో బీజేపీదే విజయం: డా.లక్ష్మణ్
12 Aug 2022 12:45 PM GMT