గోషామహల్‌ అభ్యర్థి చంద్రముఖి ఆదృశ్యం

గోషామహల్‌ అభ్యర్థి చంద్రముఖి ఆదృశ్యం
x
Highlights

ఎన్నికల ప్రచారం హోరెత్తింది అభ్యర్థులంతా బీజీగా బిజీగా ఉన్నారు పోటీలో ఉన్న ఓ అభ్యర్థి మాత్రం కనిపించకుండా పోయారు ఆ అభ్యర్థిని కిడ్నాప్ చేశారని...

ఎన్నికల ప్రచారం హోరెత్తింది అభ్యర్థులంతా బీజీగా బిజీగా ఉన్నారు పోటీలో ఉన్న ఓ అభ్యర్థి మాత్రం కనిపించకుండా పోయారు ఆ అభ్యర్థిని కిడ్నాప్ చేశారని చెబుతున్నారు మా అభ్యర్థి ఆచూకీ తెలుపండి అంటూ నేతలు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ అభ్యర్థి కిడ్నాప్ కలకలం రేపుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి సారి ఓ ట్రాన్స్ జెండర్ బరిలో నిలిచారు. ఆమే చంద్రముఖి. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరపున గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అట్టహాసంగా నామినేషన్ వేసిన చంద్రముఖి ప్రచారం ముమ్మరం చేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ చంద్రముఖి మంగళవారం నుంచి ఆచూకీ తెలియడం లేదు. యూసఫ్ గూడలో ఇందిరానగర్ లో నివసిస్తుంది. ఇంటి వద్ద గుర్తుతెలియని రెండు సుమో వాహనాలు తిరిగినట్టు తెలిసింది. ఇద్దరు వ్యక్తులు ఏదో మాట్లాడాలని చెప్పి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది.

ఉదయం 8.15 గంటలకు చివరిసారిగా చంద్రముఖి మోబైల్ ఫోన్ పని చేయడాన్ని బట్టి ఎర్రమంజిల్ చౌరస్తా వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. దీంతో ఆమె అదృశ్యమయ్యారని బంధువులు, తోటి ట్రాన్స్ జెండర్లు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిఎల్ఎఫ్ అభ్యర్థి చంద్రముఖి కిడ్నాప్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె పోటీ చేస్తున్న గోషామహల్ బరిలో ఉన్న ప్రత్యర్ధి పార్టీల నేతలు కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలను బిఎల్ఎఫ్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. చంద్రముఖి కిడ్నాప్ కావడం ఆందోళనకరమని వెంటనే ఛేదించాలని సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories