నువ్వేమైనా రామ్ చరణ్ అనుకుంటున్నావా?: అడవి శేష్‌తో బడా ప్రొడ్యూసర్

‘క్షణం’ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ‘గూఢచారి’ ఈ శుక్రవారం విడుదలై...
‘క్షణం’ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ‘గూఢచారి’ ఈ శుక్రవారం విడుదలై విజయవంతమైన చిత్రంగా నిలిచింది. పాజిటివ్ టాక్‌లో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తుండంతో విజయోత్సవాల్లో తేలుతోంది చిత్ర యూనిట్. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్‌గా అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్‌పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ నామ, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ‘గూఢచారి’ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు శేష్.
‘‘క్షణం మూవీ తర్వాత 50 పైగా సినిమాల ఆఫర్లు వచ్చాయి. కానీ నేను వాటన్నింటికి నో చెప్పాను. దీనికి కారణం నేనేదో గొప్ప అని అనుకుని కాదు. నచ్చితే చేసేస్తాం. నచ్చకపోతే చెయ్యం అంతే. ఓ పెద్ద ప్రొడ్యూసర్ నన్ను తిట్టారు. ‘నువ్వేమైనా రామ్ చరణ్ అనుకుంటున్నావా? వెలుగు కొంతకాలమే ఉంటుంది. కొంచెం చూసుకో’ అని. అప్పుడు నేను అదేం లేదు సార్. మీరు నాకు ఇవ్వకపోతే పర్లేదు సార్. నచ్చిన సినిమానే చేసుకుంటా అని జెన్యూన్‌గా సమాధానం చెప్పాను. ఆయనకు కోపం వచ్చిందని నేనేం బాధ పడలేదు. మనకు నచ్చిన సినిమా మాత్రమే చెయ్యాలి అని. ఒకటి మనకు నచ్చిన సినిమా ఆడకపోతే ఓకే మనకు నచ్చిన పని చేశాములే సమాధానం చెప్పుకోవచ్చు. అదే నచ్చని సినిమా చేసి అది ఆడలేదంటే.. అంతకన్నా బ్యాడ్ ఇంకోటి ఉండదు’’ అని చెప్పుకొచ్చాడు శేష్.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMTఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి...
27 May 2022 12:48 PM GMT