తెలంగాణ విద్యార్థులకు శుభవార్త

Highlights

త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మరో చేయూతనియ్యబోతుంది.. రాష్ట్రంలోని ఇంటర్ చదివే ప్రతి విద్యార్థికి ఉచిత బుస్స్ పాస్ మరియు మధ్యాన భోజన...

త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మరో చేయూతనియ్యబోతుంది.. రాష్ట్రంలోని ఇంటర్ చదివే ప్రతి విద్యార్థికి ఉచిత బుస్స్ పాస్ మరియు మధ్యాన భోజన పధకానికి శ్రీకారం చుట్టబోతుంది.. దీనిపై నిన్న తెలంగాణ విద్యశాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ త్వరలో ఈ విషయమై సీఎంతో చర్చిస్తానని చెప్పారు.. అన్ని కుదిరితే వచ్చే ఏడాది నుంచి ఈ పధకం మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు..

అంతేకాదు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల పెంపుపై విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఇంజనీరింగ్‌ కాలేజీలకు కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం వెకేట్‌ పిటిషన్‌ వేసినట్టు ఆయన చెప్పారు.ఈ అంశంపై అప్పీల్‌ కు వెళ్లడం గురించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాలేజీలు ఫీజులు పెంచాలంటే వచ్చే విద్యా సంవత్సరంలో ఫీజు నియంత్రణ కమిటీ నిర్ణయం మేరకే పెంచాలన్నారు. ఇప్పుడున్న రూ. లక్షా 13 వేల ఫీజును రూ. 2 లక్షలకు పెంచితే విద్యార్థులకు భారంగా మారుతుందని వారిని ఇబ్బంది పెట్టె విధంగా యాజమాన్యం వ్యవహరించొద్దని అయన అన్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories