ఒంటి మీద బంగారు నగలతో అలరిస్తోన్న బాబా

ఒంటి మీద బంగారు నగలతో అలరిస్తోన్న బాబా
x
Highlights

ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎందరో బాబాలున్నారు. నాటి భగవాన్ సత్యసాయి బాబా నుంచి నిన్నటి పుట్టపర్తి సత్యసాయి బాబా వరకు ఎందరో బాబాలున్నారు. ఊరికో బాబా మనకు...

ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎందరో బాబాలున్నారు. నాటి భగవాన్ సత్యసాయి బాబా నుంచి నిన్నటి పుట్టపర్తి సత్యసాయి బాబా వరకు ఎందరో బాబాలున్నారు. ఊరికో బాబా మనకు నిత్యం కనిపిస్తూ ఉంటారు. కాని ఆ బాబా అలాంటి ఇలాంటి బాబా కాదు. ఆయనో గోల్డెన్ బాబా.

గోల్డెన్‌ బాబాగా ప్రసిద్ధి చెందిన సుధీర్‌ మక్కర్ తీరు చర్చనీయాంశంగా మారింది. హరిద్వార్ నుంచి ఢిల్లీకి 200 కిలోమీటర్ల 25వ కన్వర్‌ యాత్రను ఈ గోల్డెన్‌ బాబా చేపట్టారు. యాత్ర కామన్ అయినా.. బాబా తీరు హాట్‌ టాపిక్‌గా మారింది. బాబాలంటే కామన్‌గా చేతిలో రుద్రాక్షలు పట్టుకుని యాత్ర చేస్తారు. కానీ ఈ యాత్ర జరిగే విధానం చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఈ యాత్రలో ఒంటి నిండా 20 కేజీల బంగారు ఆభరణాలతో దర్శనం ఇస్తున్నారు. బాబా ధరించిన ఆభరణాల్లో 21 గొలుసులు, 21 లాకెట్లు ఉన్నాయి.

ఇంతటితో బాబా ఆభరణాల జాబితా అయిపోలేదు. బంగారు జాకెట్ తో పాటు 27 లక్షల విలువైన రోలెక్స్ వాచ్ కూడా ఈ బాబా సొంతం. బాబా ధరించిన ఆభరణాల విలువ ఇప్పటి మార్కెట్ ప్రకారం అక్షరాల 6 కోట్ల రూపాయలు పలుకుతుంది. బాబా భద్రత కోసం సీఐ ర్యాంక్ ఆఫీసర్ తోపాటు ఐదుగురు కానిస్టేబుళ్లు రక్షణగా నిలుస్తున్నారు.

గోల్డెన్ బాబా యాత్రలోని అన్నీ కార్లు కాస్ట్లీనే. BMW కారులో ప్రయాణిస్తారు. ఇంత భారీ హంగామాతో చేపట్టిన మాక్కర్ అలియాస్ గోల్డెన్ బాబా 25వ కన్నర్ యాత్రలో యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన ఆశీర్వాదం కోసం ప్రజలు ఎగబడుతున్నారు. తాను చచ్చిపోయే వరకు ఈ బంగారమంతా తన దగ్గరే ఉంటుందంటున్నాడు బాబా. తాను చనిపోయే సమయంలో తనకు నచ్చిన భక్తుడికి ఈ బంగారమంతా ఇస్తానని అతను అన్నాడు. ఆధ్యాత్మికత వైపు రాకముందు సుధీర్ మక్కర్ ఓ బట్టల వ్యాపారం చేస్తుండేవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కోట్లకు అధిపతిగా మారడం చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories