Top
logo

పసుపుతాడే ఉరితాడై …

X
Highlights

హైదరాబాద్ మియాపూర్‌లో దారుణం.. ఓ మైనర్ బాలిక మెడలో పసుపుతాడు కట్టిన యువకుడు ఆ ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్...

హైదరాబాద్ మియాపూర్‌లో దారుణం.. ఓ మైనర్ బాలిక మెడలో పసుపుతాడు కట్టిన యువకుడు ఆ ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. వీటిని చూసిన ఆ బాలిక పేరెంట్స్ ఆమెను మందలించడంతో.. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. బాబు అనే యువకుడు గత కొంతకాలంగా భవాని అనే 17 సంవత్సరాల అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. భవానిని తన ఇంటికి తీసుకు వెళ్లి, మెడలో ఐదు రోజుల క్రితం పసుపుతాడు కట్టి, ఆపై ఆమెను ఇంటికి పంపించిన బాబు, ఆ ఫొటోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. వీటిని చూసిన బాబు ఫ్రెండ్స్ విషయాన్ని భవాని బంధువుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఆమెను మందలించారు. అతను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని చెప్పిన భవాని, నిన్న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భవాని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న బాబును త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.

Next Story