దళితున్ని పెళ్లి చేసుకుందని కోర్టు ఆవరణలోనే..

పంజాబ్‌లో ఘోరం చోటుచేసుకుంది. దళిత యువకున్ని పెళ్లిచేసుకుందని అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుని కాల్చిచంపాడో ...
పంజాబ్‌లో ఘోరం చోటుచేసుకుంది. దళిత యువకున్ని పెళ్లిచేసుకుందని అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుని కాల్చిచంపాడో కసాయి తండ్రి. ఈ ఘటన రోహ్‌తక్ కోర్టు ప్రాంగణంలో చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, ఆమెకు రక్షణగా ఉన్న పోలీస్ ఇన్స్‌పెక్టర్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. హర్యానాలోని రోహ్‌తక్ పట్టణంలో నివాసముండే రమేష్ దంపతులకు పిల్లలు కలగక పోవడంతో తమ బందువుల అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమెకు మమత అని పేరుపెట్టి చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయితే మమత అదే ప్రాంతానికి చెందిన సోంబీర్ అనే దళిత యువకున్ని ప్రేమించింది. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
అయితే మమత ఇంకా మైనర్ కావడంతో రమేష్ తన కూతురిని సోంబేర్ కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సోంబీర్ ను అరెస్ట్ చేశారు. అయినప్పటికి మమత ఇంటికి రాకుండా సోంబీర్ ఇంట్లోనే ఉంటోంది. ఇవాళ సోంబీర్ ను రోహ్‌తక్ కోర్టులో హాజరుపర్చారు. అయితే ఇక్కడికి వచ్చిన కూతురుని చూడగానే ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన తండ్రి రమేష్ నిన్ను మరికొద్దిసేపట్లో చంపేస్తానని బెదిరించాడు. అయితే అతడు కోపంలో అలా అంటున్నాడని అందరూ భావించారు. కానీ అతడె అలా అన్న కొద్దిసేపటికే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి కోర్టు ఆవరణలోనే మమతను తుపాకీతో కాల్చి చంపారు. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన స్థానిక ఎస్సైపై కూడా కాల్పులు జరపడంతో అతడు కూడా మృతిచెందాడు.
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్...
14 Aug 2022 4:00 PM GMTహైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయంలో...ఆజాదీకా అమృత్ మహోత్సవ్...
14 Aug 2022 3:00 PM GMTపేద విద్యార్థులకు ఉప్పల ట్రస్టు సహకారం
14 Aug 2022 2:30 PM GMT3 వారాల విశ్రాంతి తర్వాత బయటకొచ్చిన మంత్రి కేటీఆర్
14 Aug 2022 2:00 PM GMTసోమాజిగూడలో లలితా జ్యువెలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
14 Aug 2022 1:30 PM GMT