నోకియా ఫోను పేలి యువతి మృతి

ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడితే, మొబైల్స్ పేలిపోతున్న సంఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. కొన్ని సంఘటనల్లో...
ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడితే, మొబైల్స్ పేలిపోతున్న సంఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. కొన్ని సంఘటనల్లో చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టే మాట్లాడుతూనే ఉన్నారు. ఇదే మాదిరిగా ఒడిశాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఒడిశాలో జర్సుగుడ జిల్లాలో లైకెరా పోలీసు స్టేషన్ పరిధిలో 18 ఏళ్ల యువతి మొబైల్ ఛార్జింగ్ పెట్టి, ఫోన్ మాట్లాడుతుండగా దాన్ని బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలు ఉమా ఓరమ్‌గా సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఛార్జింగ్‌లో ఉండగానే ఉమా.. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా భారీ శబ్దంతో ఫోన్ బ్యాటరీ పేలిపోయింది. దీంతో ఆమె ఛాతికి, కాలుకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఉమా స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్టు ధృవీకరించారు డాక్టర్లు. ఆ సెల్ ఫోన్ నోకియా మోడల్ అని తెలిసింది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT