మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలున్న వ్యక్తి గంట కొట్టడమా?.. అజారుద్దీన్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలున్న వ్యక్తి గంట కొట్టడమా?.. అజారుద్దీన్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు
x
Highlights

భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా విండీస్ తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్...

భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా విండీస్ తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ ప్రారంభానికి సంకేతంగా గంట మోగించే గౌరవాన్ని మహ్మద్ అజరుద్దీన్ కు బీసీసీఐ కల్పించింది.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం ఎదుర్కొన్న అజర్ న్యాయపోరాటం తో బయటపడటమే కాదు తనకు ఎంతగానో అచ్చివచ్చిన ఈడెన్ గార్డెన్స్ లో గంట మోగించడం ద్వారా ఓ అంతర్జాతీయ మ్యాచ్ ను ప్రారంభించే అవకాశాన్ని అజర్ తిరిగి సంపాదించుకోగలిగాడు. ఎందరో క్రికెట్ దిగ్గజాల సాక్షిగా గంట మోగించడం ద్వారా మ్యాచ్ ను ప్రారంభించాడు. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియా మాజీ ఓపెనర్ , ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్ చేసిన ట్విట్ మాత్రం కలకలం రేపింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాలం బహిష్కరణకు గురైన ఓ క్రికెటర్ కు భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ లో గంట మోగించే అరుదైన గౌరవాన్ని ఎలా కల్పిస్తారంటూ బీసీసీఐ పైన గౌతం గంభీర్ మండిపడ్డాడు. కోల్ కతా టీ-20 మ్యాచ్ లో టీమిండియా విజేతగా నిలిచినా వివాదాస్పద అజరుద్దీన్ ను గంట మోగించడానికి అనుమతించడం ద్వారా బీసీసీఐ పాలకమండలి పరాజయం పాలయ్యిందంటూ గంభీర్ ట్విట్ చేశాడు. మహ్మద్ అజరుద్దీన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతితో హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో పోటీకి దిగినా గంట మోగించడానికి అనుమతించడం ఏవిధంగానూ సమర్థనీయం కాదని గంభీర్ సమర్థించుకొన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories