Top
logo

విమర్శిస్తే గుండు కొట్టించి గాడిదపై ఊరేగిస్తా

విమర్శిస్తే గుండు కొట్టించి గాడిదపై ఊరేగిస్తా
X
Highlights

బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బండి సంజయ్...

బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ క్రిమినల్ అని వ్యక్తిగత విమర్శలు చేస్తే గుండు కొట్టించి గాడిదపై ఊరేగిస్తా అని హెచ్చరించారు. నాది దొంగ వ్యాపారం అని భావిస్తే చేతనైతే ఆదాయ పన్ను శాఖ చేత దాడులు చేయించుకోవాలని సవాల్‌ విసిరారు. రానున్న ఎన్నికల్లో కరీంనగర్‌లో బీజేపీ అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. భారతీయ జనతా పార్టీ జూటా పార్టీ అని, ఆ పార్టీ చీఫ్‌ జూటా షా అని గడ్కరీనే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేది బీజేపీ పార్టీ అని విమర్శించారు.

Next Story