Top
logo

శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌
X
Highlights

అభం శుభం తెలియని పసి గుడ్డును అమ్మ ఒడిలో నుంచి దూరం చేస్తున్నారు ఆ కేటుగాళ్లు. హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌లో శిశు...

అభం శుభం తెలియని పసి గుడ్డును అమ్మ ఒడిలో నుంచి దూరం చేస్తున్నారు ఆ కేటుగాళ్లు. హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌లో శిశు విక్రయాలు జరుపుతున్న ముఠా పట్టుబడింది. బాలల హక్కుల సంఘం, ఎస్‌ఓటీలు, పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌లో ముఠా దొరికింది. ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు కలిసి ముఠాగా ఏర్పడి పొత్తిళ్లలో పసిపిల్లలను విక్రయిస్తున్నారు.

హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ పరిధిలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసుల విచారణలో మరికొందరు ముఠా సభ్యులు బయటపడే అవకాశం ఉంది. శిశువును విక్రయిస్తున్న ముఠా నుండి 80వేల రూపాయల నగదు, నాలుగు మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగర్‌ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పోతెపల్లికి చెందిన 11 రోజుల పసిపాపను విక్రయించడానికి ముఠా ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Next Story