logo
జాతీయం

ఎంపీ గల్లా ప్రసంగంపై టీఆర్ఎస్ ఎంపీల అభ్యంతరం

ఎంపీ గల్లా ప్రసంగంపై టీఆర్ఎస్ ఎంపీల అభ్యంతరం
X
Highlights

అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.....

అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మరో ఎంపీ గల్లా జయదేవ్‌ చర్చను ప్రారంభించారు. ఎన్డీయే నుంచి బయటకు రాగానే టీడీపీపై కేంద్రం యుద్ధం ప్రకటించిందని ఈ సందర్భంగా గల్లా వ్యాఖ్యానించారు. అయితే గల్లా మాట్లాడుతున్న సమయంలోనే సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అప్రజాస్వామికంగా ఏపీని విభజించారంటూ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఏపీనే అని అన్నారు. రాజధాని లేదు ఆదాయంలో లోటు ఉందని, ఏపీ అనిశ్చతిలో ఉందని గల్లా పేర్కొన్నారు. మందబలంతో, వివక్షతతో అన్యాయంగా గొంతునొక్కి విభజన బిల్ పాస్ చేశారని ఆరోపించారు. తెలంగాణకు ఆస్తులు ఏపీకి అప్పులు ఇచ్చారని అన్నారు. దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. తమ స్థానాల్లో నిలబడి ఆందోళన తెలిపారు. ఎంపీ గల్లా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

Next Story