పుల్వామాలో ఉగ్రదాడి..నలుగురు జవాన్లు వీరమరణం

పుల్వామాలో ఉగ్రదాడి..నలుగురు జవాన్లు వీరమరణం
x
Highlights

దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లెత్‌పోరలో సీఆర్‌పీఎఫ్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. మరో...

దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లెత్‌పోరలో సీఆర్‌పీఎఫ్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున పుల్వామా జిల్లా కేంద్రంలోని సీఆర్పీఎఫ్‌ శిక్షణా కేంద్రంలోకి చొరబడిన ఉగ్రవాదులు.. గ్రెనేడ్లు, తుపాకి కాల్పులతో బీభత్సం సృష్టించారు. గంటలపాటు కొనసాగిన కౌంటర్‌ ఆపరేషన్‌లో చివరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఆదివారం తెల్లవారుజామున 2.10 గంటలకు ఈ ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఉగ్రవాదులు గ్రనేడ్లు విసురుతూ, కాల్పులు జరుపుతూ శిక్షణా కేంద్రంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. కాగా, ఈ ఘటనకు తామే పాల్పడ్డామంటూ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. జైషే మహ్మద్ కమాండర్ నూర్ మొహమ్మద్ తాంత్రేను గత మంగళవారంనాడు పుల్వామా జిల్లా సంబూర గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు మట్టుబెట్టిన నేపథ్యంలో ఈ ప్రతీకారదాడులు చోటుచేసుకున్నాయి. దీంతో మరిన్ని దాడులు జరిగే అవకాశాలునట్టు బలగాలు అనుమానిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories