విషాదం.. ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ నలుగురు దుర్మరణం!
చెన్నైలో ఘోర ప్రమాదం జరిగింది. సబర్బన్ రైల్లో ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు మృత్యువాత...
చెన్నైలో ఘోర ప్రమాదం జరిగింది. సబర్బన్ రైల్లో ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్స్‌కి షిఫ్ట్ చేశారు. చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సబర్బన్ రైల్లో విపరీతమైన రద్దీ కారణంగా పలువురు ప్రయాణికులు ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తుండగా ఈ దారుణం జరిగింది. ట్రాక్ పక్కనుండే విద్యుత్ స్తంభాలు తగిలి పలువురు ప్రయాణికులు ట్రైన్ నుంచి కిందపడిపోయారు. వేగంగా విద్యుత్ స్తంభాలను ఢీకొట్టడంతో తలలు పగిలాయి. దాంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే చైన్ లాగి ట్రైన్ నిలిపివేసిన ప్రయాణికులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు మరణించినవారి మృతదేహాలను చెన్నై ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
ఉద్యోగులు పెన్షనర్లకి శుభవార్త.. రిటైర్మెంట్ చేసిన వెంటనే ప్రయోజనం..!
8 Aug 2022 4:15 PM GMTRajinikanth: రాజకీయ రంగ ప్రవేశంపై తలైవా ఏమన్నారంటే?!
8 Aug 2022 4:00 PM GMTLIC New Policy: ఎల్ఐసీ అదిరే పాలసీ.. ప్రతి నెలా రూ. 2190 చెల్లిస్తే...
8 Aug 2022 3:30 PM GMTCM Jagan: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..
8 Aug 2022 3:15 PM GMTవీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య భావోద్వేగ ప్రసంగం
8 Aug 2022 3:00 PM GMT