కరుణానిధి ఆత్మీయ నేస్తం...

కరుణానిధి ఆత్మీయ నేస్తం...
x
Highlights

అనునిత్యం ప్రజాసేవలోనే తరించిన డిఎంకే అధినేత కరుణానిధి వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని ఆసక్తికర ఘట్టాలున్నాయి. ఆయన జీవితాంతం వెంటనడిచిన వారిలో ఓ పెంపుడు...

అనునిత్యం ప్రజాసేవలోనే తరించిన డిఎంకే అధినేత కరుణానిధి వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని ఆసక్తికర ఘట్టాలున్నాయి. ఆయన జీవితాంతం వెంటనడిచిన వారిలో ఓ పెంపుడు కుక్క కూడా ఉంది. ఖన్నా అనే పేరున్న ఆ కుక్కను ఆయన చాలా ప్రేమించేవారు. ఆయన పుణ్యమాని ఆ కుక్కకు కూడా ఎక్కడికెళ్లినా విఐపి ట్రీట్ మెంట్ దక్కేది.

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి ఎందరో ప్రముఖులతో స్నేహ సంబంధాలున్నాయి. రాజాజీ, మదురై కామరాజ్, కథారచయిత తెన్నరుసు ఇలా చెప్పుకుంటూ పోతే తమిళనాడులో ఎందరో ప్రముఖులు ఆయనతో మంచి స్నేహ బంధాన్నే కొనసాగించారు. వీరందరూ ఒక ఎత్తయితే గోపాలపురంలోని ఆయన ఇంటి వరండాలో రాజసం ఒలికిస్తూ కూర్చునే ఓ కుక్క అంటే కూడా ఆయనకు పిచ్చి ప్రేమ. కరుణానిధికి పెంపుడు కుక్కలంటే మహాప్రేమ అందుకు సాక్ష్యమే ఈ ఫొటో.

లాషాప్సో జాతికి చెందిన ఈ కుక్క పేరు ఖన్నా ఇది కరుణానిధి ఇంట్లో ఒక వీఐపీలా తిరుగుతుంటుంది. కరుణానిధి ఇంటి దగ్గరుంటే ఆయన కాళ్ల దగ్గరే కూర్చునేది. ఖన్నా గేటు దగ్గరకు పరుగెడుతూ అరుస్తోందంటే తలైవార్ ఇంటికొస్తున్నారని అర్ధం. కరుణానిధి కారు దిగగానే ముందు ఆ కుక్కను దగ్గరకు తీసుకుని, తల నిమిరి పలకరించి వదిలిపెట్టే వారు. రోజుకు రెండు సార్లు తానే ఆ కుక్కకు బిస్కెట్లు కూడా తినిపించేవారు. రచయితగా బిజీగా ఉన్న టైమ్ లో కొడైకెనాల్, ఊటీ లాంటి ప్రాంతాల కెలితే ఈ కుక్కను కూడా వెంట బెట్టుకుని వెళ్లేవారు. టీవీ సీరియల్ రైటర్ గా మారాక కూడా సీరియల్ తొలి ఎపిసోడ్ లో కుక్కను కూడా చూపేవారు.

డిఎంకే అధినేత ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టాక కుటుంబ సభ్యులు కుక్కలను దూరం పెట్టేశారు. ఆలీవర్ రోడ్ లో ఉన్న కరుణానిధి ఇంట్లో లాషాప్సో బ్రీడ్ కుక్కకు తోడు డాష్ హుండ్స్ జాతి కుక్కలు కూడా ఉండేవి. ఇక కనిమొళి కొడుకు, కరుణానిధి మనవడు ఆదిత్యన్ కు కూడా కుక్కలంటే ప్రేమే పార్టీ హెడ్ క్వార్టర్స్ అన్నా అరివాలయం కు వెళ్లే దారిలో ఓ వీధికుక్క కూడా కరుణానిధి వెంట నడిచేది. ఆవిషయాన్ని అనేక బహిరంగ సభల్లో కూడా తలైవార్ ప్రస్తావించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories