Top
logo

బాబ్లీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

బాబ్లీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
X
Highlights

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు.. బాబ్లీ ప్రాజెక్ట్ జలకలను సంతరించుకుంది. బాబ్లీ ప్రొజెక్టులోకి భారీగా...

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు.. బాబ్లీ ప్రాజెక్ట్ జలకలను సంతరించుకుంది. బాబ్లీ ప్రొజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో.. 2 గేట్లు ఎత్తి దిగువకు 20 వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నదికి వదిలారు. బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి గోదావరి నీళ్లు పరవళ్లు తొక్కుతూ శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కు పరుగులు పెడుతున్నాయి. 24 గంటల్లో SRSP లోకి వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. మరో వైపు ఎగువన కురిసిన వర్షాలకు కౌలాస్ నాలా ప్రాజెక్టుకు 393 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.

Next Story