గాఢ నిద్రలో ఉండగా...అర్ధరాత్రి అగ్ని ప్రమాదం...

గాఢ నిద్రలో ఉండగా...అర్ధరాత్రి అగ్ని ప్రమాదం...
x
Highlights

అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కొలిర్‌విలిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అంతా గాఢ నిద్రలో...

అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కొలిర్‌విలిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలకు సజీవ దహనం అయ్యారు. ప్రమాదంలో చిక్కుకుని మొత్తం నలుగురు మృతి చెందారు. వీరిలో నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు తోబుట్టువులున్నారు.

నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం గుర్రపుతండ గ్రామానికి చెందిన శ్రీనివాస్ నాయక్, సుజాత దంపతుల కుమార్తెలు సాత్విక నాయక్, జ్వాయినాయక్, కుమారుడు సుహాస్ నాయక్ ఏడాది క్రితం అమెరికా వెళ్లారు. క్రిస్మస్ వేడుకలకు తల్లిదండ్రులు భారత్ వచ్చారు. సాత్విక, సుహాస్, జయ్ ముగ్గురూ కొలిర్‌విలీలోని చర్చిలో ప్రార్థనలు చేశారు. ఆ తరువాత తమ కుటుంబ స్నేహితులైన క్యారిక్రూడిట్ ఇంటికి వెళ్లారు. క్యారిక్రూడిట్ ఇంట్లో ఉన్న సమయంలోనే మంటలు చెలరేగాయి. ఆ మంటలకు ముగ్గురు విద్యార్థులతో పాటు క్యారిక్రూడిట్ చనిపోయారు.

గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ గతంలో అమెరికాలో ఫాస్టర్ గా పని చేసి నల్లగొండకు వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. శ్రీనివాస్ పిల్లలు ముగ్గురు మాత్రం అమెరికాలో ఉంటున్నారు. మిసిసీపీలోని ఓ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ముగ్గురు పిల్లలు శీతాకాల సెలవులు ఇచ్చినా స్వదేశానికి రాకుండా అక్కడే ఉన్నారు. ప్రమాద ఘటన తెలుసుకున్న శ్రీనివాస్ నాయక్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. హుటాహుటిన అమెరికా పయనమయ్యారు. మృత దేహాలను స్వదేశం తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోవడంతో స్వగ్రామం గుర్రపుతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories