సోద‌రితో స్పెయిన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఫిదా ముద్దుగుమ్మ

సోద‌రితో స్పెయిన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఫిదా ముద్దుగుమ్మ
x
Highlights

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని దోచుకుంది మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వి. ఆమె మలయాళీ నటి అయినప్పటికీ మొదటి సినిమాకే తెలుగులో డబ్బింగ్‌...

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని దోచుకుంది మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వి. ఆమె మలయాళీ నటి అయినప్పటికీ మొదటి సినిమాకే తెలుగులో డబ్బింగ్‌ చెప్పారు. చక్కటి అభినయం, డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె నాని సరసన ‘ఎంసీఏ’ సినిమాలో నటించారు. మరోపక్క ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘కణం’ సినిమాలోనూ కథానాయిక పాత్ర పోషించారు. ఈ రెండు చిత్రాల పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం కాస్త‌ టైం దొర‌క‌డంతో సోద‌రి పూజా క‌న్న‌న్‌తో క‌లిసి స్పెయిన్‌లో చక్క‌ర్లు కొడుతుంది. స్పెయిన్‌లో వివిధ ప్రాంతాల‌ని సంద‌ర్శిస్తూ అక్క‌డి ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అక్కా చెల్లెళ్ళు. ఈ పిక్స్ ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. సాయిపల్లవి ‘మారి 2’ అనే తమిళ సినిమాలో నటించనుండ‌గా,. హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్న ఓ తెలుగు ప్రాజెక్టు చేయ‌నున్న‌ట్టు టాక్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories