బాస్ హోదాలో కుమారుడికి సెల్యూట్..

బాస్ హోదాలో కుమారుడికి సెల్యూట్..
x
Highlights

తన కొడుకు తన కన్నా గొప్పవాడు కావాలి.. గొప్ప స్థితిలో ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. ప్రజలు ఆ కొడుకుని చూసి మెచ్చిన రోజే తండ్రికి నిజమైన సంతోషం....

తన కొడుకు తన కన్నా గొప్పవాడు కావాలి.. గొప్ప స్థితిలో ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. ప్రజలు ఆ కొడుకుని చూసి మెచ్చిన రోజే తండ్రికి నిజమైన సంతోషం. ఇలాంటి స్టోరీలు చాలా సినిమాల్లో చూసుంటాం. కానీ అలాంటి నిజమైన కథే ఓ చోట జరిగింది. ఉత్తర ప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జనార్ధన్ సింగ్ ఇప్పుడు అలాంటి ఆనందంలోనే మునిగితేలుతున్నాడు. జనార్థన్ పనిచేస్తున్న చోటే ఆయన కుమారుడు, ఐపీఎస్ అధికారి అనూప్ కుమార్ సింగ్ ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనూప్ లక్నో నగర బాధ్యతలు చేపట్టగా... విభూతి కంద్ పోలీస్‌ స్టేషన్లో ఆయన తండ్రి పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా జనార్థన్ మీడియాతో ముచ్చటిస్తూ...బాస్ హోదాలో తన కుమారుడికి సెల్యూట్ చేయడంలో తప్పేమీ లేదంటున్నారు జనార్థన్ సింగ్. విధి నిర్వహణలో బాస్.. ఇంటికి వచ్చాకే తన కుమారుడు అన్నారు. ముందు ఆఫీసర్‌గా గౌరవిస్తానని.. తర్వాతే తన కుమారుడిగా ప్రేమ చూపిస్తానన్నారు. తండ్రీకొడుకుల బంధం.. విధుల విషయంలో అడ్డుకాకూడదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories