logo
జాతీయం

క‌దం తొక్కిన రైతులు..ఢిల్లీలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న

క‌దం తొక్కిన రైతులు..ఢిల్లీలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న
X
Highlights

రుణా మాఫీ, పండించిన పంటలకు కనీస మద్దరు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాతలు కదం...

రుణా మాఫీ, పండించిన పంటలకు కనీస మద్దరు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాతలు కదం తొక్కారు. రాంలీలా మైదాన్ వద్దకు పెద్దఎత్తున రైతులు ఆందోళన బాట పట్టారు. పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళన బాగంగా భారీ సంఖ్యలో హాజరై ఢిల్లీలో రెండ్రోజులపాటు నిరసన కార్యక్రమం చేపట్టారు. దింతో దేశ రాజధానిలో రోడ్లపై ఎర్రజెండాలతో కదం తొక్కడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పిడిందని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ స‌మావేశంలో రెండు బిల్లులు ప్రవేశ‌పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. గ‌త స‌మావేశాల్లో ఆ రెండు బిల్లుల‌ను ప్రైవేట్ మెంబ‌ర్ బిల్లులుగా ప్రవేశ‌పెట్టారు. ఆ బిల్లుల‌కు 21 పార్టీలు మ‌ద్దతు తెలిపాయి. నేడు త‌మిళ‌నాడుకు చెందిన రైతులు ఢిల్లీ రైల్వే స్టేష‌న్‌లో ధ‌ర్నాకు దిగారు. చాలాసేపు రైళ్లను నిలిపేశారు. పోయిన ఏడాది జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద వంద రోజుల పాటు రైతులు ఆందోళ‌న నిర్వహించారు. ఢిల్లీలో అయిదు ప్రాంతాల నుంచి సుమారు ప‌దివేల రైతులు ఇవాళ రామ్‌లీలా మైదాన్‌కు చేరుకోనున్నారు.

Next Story