logo
జాతీయం

మంత్రాలకు పంటలు

X
Highlights

పంటలకు ఎరువులు, పురుగుల మందులు ఉపయోగించకుండా కాస్మిక్‌ ఎనర్జీ ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చని సురేశ్‌ చంద్ర,...

పంటలకు ఎరువులు, పురుగుల మందులు ఉపయోగించకుండా కాస్మిక్‌ ఎనర్జీ ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చని సురేశ్‌ చంద్ర, శ్రీమతి నయన్‌లు తెలిపారు. అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు మూడు యూనివర్శిటీలు కాస్మిక్ ఎనర్జీ పద్దతిపై అధ్యయనం చేసి సంతృప్తి వ్యక్తం చేశాయని సురేశ్‌ చంద్ర, నయన్‌లు చెప్పారు. ప్రాచీన శివయోగ పరంపరలో నిష్ణాతులైన బాబా శివనంద్‌ జీ నుంచి అరగంటసేపు దీక్ష తీసుకున్న రైతులు తమ పొలానికి ప్రాణశక్తిని సూర్యుడి ద్వారా జీవితాంతం, ఎన్ని ఎకరాల పొలానికైనా కాశ్మిక్ ఎనర్జీని ప్రసరింపజేయగలరని తెలిపారు.

రసాయనిక వ్యవసాయంతో పోల్చితే 70శాతం ఖర్చు ఆదా అవుతుందని దిగుబడి రెండు మూడు రెట్లు పెరుగుతుందని సురేశ్‌ చంద్ర చెబుతున్నారు. ప్రజలకు పోషక విలువలున్న సహజ ఆహారం లభిస్తుందంటున్నారు. ఖర్చు లేని దివ్యమైన ఈ వ్యవసాయ పద్దతిని అనుసరించాలనుకున్న రైతులు ఇవాళ, రేపు హిమాలయ ప్రాంతంనుంచి బాబా శివానంద్‌ జీ టీవీ ద్వారా ప్రసంగిస్తారన్నారు. దేశంలో ఏ గ్రామంలో ఉన్న వారైనా ఈ దీక్షలో పాల్గొనవచ్చని హిందీలో ప్రసంగాన్ని తాము తెలుగులో రైతులకు తెలియజేస్తామని చెప్పారు.

Next Story