చేతినిండా పంటనిచ్చిన కాజల్ ఫోటో

x
Highlights

హీరోయిన్ల ఫోటోలు వాల్ పోస్టర్లుగా చూసుంటారు థియేటర్ల దగ్గర ప్లెక్సీలుగా చూసుంటారు ఇంకొన్ని చోట్ల కటౌట్లుగా చూసుంటారు. కానీ దిష్టిబొమ్మలుగా చూశారా.?...

హీరోయిన్ల ఫోటోలు వాల్ పోస్టర్లుగా చూసుంటారు థియేటర్ల దగ్గర ప్లెక్సీలుగా చూసుంటారు ఇంకొన్ని చోట్ల కటౌట్లుగా చూసుంటారు. కానీ దిష్టిబొమ్మలుగా చూశారా.? చూడకపోతే ఇప్పుడు చూడండి.

రైతులు అప్‌డేట్ అయ్యారనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండ‌లం గొల్ల‌ప‌ల్లికి చెందిన బిక్కుమియా అనే రైతు ప్రతి ఏటా 3 ఎక‌రాల్లో కూరగాయలు పండిస్తున్నాడు. ప్రతిసారి పంట బాగా పండడం కోత సమయానికి ఏదో ఒక తెగుళ్లు రావడం. దాంతో దిగుబడి తగ్గిపోవడం. ప్రతి ఏడూ ఇలాగే జరుగుతోంది. దీంతో బిక్కుమియా తీవ్రంగా నష్టపోయాడు. పంట బాగా పండుతోంది. సరిగ్గా చేతికొచ్చే సమయానికే ఎందుకిలా అవుతోందని ఆలోచించాడు. కొందరిని ఆరా తీస్తే అందుకు నరదిష్టే కారణమని చెప్పారట. అందుకే ఇలా కాజల్‌ను తీసుకొచ్చి సెట్ చేశారు.

బిక్కుమియా పొలం గ్రామ శివార్లలోని శివాలయానికి దగ్గరగా రోడ్డు పక్కనే ఉంటుంది. దీంతో వచ్చిపోయే వారి దృష్టి తన పంటపై పడుతోందని వారి దిష్టి తగిలే దిగుబడి తగ్గిపోతోందని గట్టిగా నమ్మేశాడు. అంతే వెంటనే పొలంలో దిష్టిబొమ్మ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని విషయం కొడుకు అన్వర్‌కు చెప్పాడు. బాగా ఆలోచించిన అన్వర్ దిష్టిబొమ్మకు బదులు దారినపోయే వారి దృష్టి మరల్చేలా తన అభిమాన హీరోయిన్ కాజల్ ప్లెక్సీ తీసుకొచ్చి పెట్టేశాడు.

పొలంలో కాజల్ ప్లెక్సీ చూసినవారి ఫోకస్ మొత్తం పంటపై నుంచి ప్లెక్సీ మదకు మళ్లింది. కొడుకు ఆలోచనకు బిక్కుమియా కూడా మురిసిపోతున్నాడు. ఇప్పుడు పంట బాగా పండిందని కొద్దిరోజుల్లోనే కూరగాయలు చేతికొస్తాయని చెప్తున్నారు. పొలంలో కాజల్ ప్లెక్సీ పెట్టాలన్న అన్వర్ ఐడియాను చుట్టుపక్కల పొలాల రైతులు అభినందిస్తున్నారు. తమ పంటలకు కూడా నరదిష్టి తగలకుండా హీరోయిన్ల ఫోటోలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అప్పట్లో గుంటూరులో ఓ రైతు తన పొలంలో సన్నీ లియోన్ ఫోటో పెట్టి అందరికీ షాకిస్తే ఇప్పుడు అన్వర్ తన పొలంలో కాజల్ ఫోటో పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories