logo
జాతీయం

బెంగళూరులో ముగిసిన అంబరీష్‌ అంత్యక్రియలు

బెంగళూరులో ముగిసిన అంబరీష్‌ అంత్యక్రియలు
X
Highlights

కన్నడ రెబల్‌ స్టార్‌, కేంద్ర మాజీ మంత్రి అంబరీష్‌‌కు కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు తుది వీడ్కోలు...

కన్నడ రెబల్‌ స్టార్‌, కేంద్ర మాజీ మంత్రి అంబరీష్‌‌కు కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు తుది వీడ్కోలు పలికారు. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో రాజ్‌కుమార్‌ స్మారకం పక్కన ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానులు తమ అభిమాన నటుడు, నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అంతిమదర్శనం చేసుకున్న తరువాత కంఠీరవ స్టూడియోకు పార్థీవదేహాన్ని తరలిస్తారని సమాచారం. అంబరీష్ మండ్య జిల్లాలో జన్మించారు. మండ్య నుంచి మూడు సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ప్రజలకు దగ్గర అయ్యారు. అంతకు ముందే రెబల్ స్టార్ గా మండ్య ప్రజకు అత్యంత సన్నిహితుడు అయ్యారు.

Next Story