Top
logo

హైదరాబాద్‌లో దొంగ బాబా ఘరానా మోసం

హైదరాబాద్‌లో దొంగ బాబా ఘరానా మోసం
X
Highlights

దుహ వైద్యం పేరుతో ప్రజలను దగా చేస్తున్న నకిలీ బాబా ఆటకట్టించారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆటోడ్రైవర్ ...

దుహ వైద్యం పేరుతో ప్రజలను దగా చేస్తున్న నకిలీ బాబా ఆటకట్టించారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్న సయ్యద్ ఇస్మాయిల్ ఆరేళ్లుగా టోలీచౌకీలో దుహ వైద్యం చేస్తున్నాడు. దీర్ఘకాలిక రోగాలతో దర్గాలకు వచ్చేవారిని టార్గెట్ చేసి వ్యాధులు నయం చేస్తానని నమ్మించేవాడు. ఇంట్లోని బంగారు నగలు, నగదు తీసుకొస్తే వారంరోజులు పూజలు చేస్తానని ఆ తర్వాత జబ్బులు నయమవుతాయని చెప్పేవాడు. ఇస్మాయిల్ మాటలు నమ్మి కొందరు భారీగా నగదు, బంగారు ఆభరణాలు అప్పజెప్పారు. వాటిని ఎంతకు తిరిగి ఇవ్వకపోవడంతో ఆనుమానించి పోలీసులను ఆశ్రయించారు. కొద్ది రోజులుగా తప్పించుకు తిరుగుతున్న బాబాను ఎట్టకేలకు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 1300 గ్రాముల బంగారు నగలు, మూడు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బాబా బంగారాన్ని మణప్పురం ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి 25 లక్షలు నగదు తీసుకొని జల్సాలు చేసినట్టు తెలిసింది.

Next Story