వసుంధర టీమ్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న సర్వేలు

వసుంధర టీమ్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న సర్వేలు
x
Highlights

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అధికార బిజెపికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వసుంధర రాజేకు...

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అధికార బిజెపికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వసుంధర రాజేకు తాజాగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు పూర్తిగా నిరాశ పరిచాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమే అయితే రాజకీయంగా ఆమె కెరీర్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ టీమ్ వసుంధర టీమ్ ను పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ గాలి వీస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అదే విషయం తెలియ చేస్తున్నాయి. వసుంధరా రాజే ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా తీవ్రస్థాయిలో ఉందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్న మాట. టైమ్స్ నౌ సర్వే ప్రకారం 200 సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీలోఎన్నికలు జరిగినవి 199 స్థానాలు వీటిలో బిజెపికి 85 , కాంగ్రెస్ కు 105, బీఎస్పీకి రెండు, ఇతరులకు రెండు సీట్లు వచ్చే అవకాశముంది.

ఇండియాటుడే టీమ్ రాజస్థాన్ అంతా విస్తృతంగా పర్యటించి 63వేలమంది ఓటర్లను సర్వే చేసింది. ఈ ఎగ్జిట్ పోల్ సర్వే కాంగ్రెస్ కు ఏకంగా 119 నుంచి 141 స్థానాలు వచ్చే ఆస్కారముందంని. బిజెపికి కేవలం 55 నుంచి 72 సీట్లు వస్తాయని, ఇతరులకు 4నుంచి 11 సీట్లు వస్తాయని అంచనా కట్టింది. ఇక ఇండియా టీవీ సర్వే కూడా కాంగ్రెస్ కి 100 నుంచి 110 సీట్లు వస్తాయని లెక్కేసింది. బిజెపికి 80 నుంచి 90 సీట్లు వస్తాయని బీఎస్పీ మూడు స్థానాలు గెలుచుకునే ఆస్కారముందని ఇతరులు ఆరునుంచి 8 సీట్లు గెలుస్తారనీ అంచనా వేస్తోంది.

ఇక రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం బిజెపికి76 సీట్లు, కాంగ్రెస్ కి115, ఇతరులకు 8 సీట్లు వస్తాయని తేలింది. ఇక ఏబీపీ ఛానెల్ రాజస్థాన్లో ప్రాంతాల వారీగా సర్వే చేసి ఫలితాలు వెల్లడించింది. ఏబీపీ సర్వే ప్రకారం 39 సీట్లున్న ఉత్తర రాజస్థాన్ లో కాంగ్రెస్ ఓట్ షేర్ 39 శాతంగా ఉంటుందని బిజెపి ఓట్ షేర్ 32 శాతం ఇతరుల ఓట్ షేర్29% గా ఉండొచ్చని తేల్చింది. ఇక పశ్చిమ రాజస్థాన్ విషయానికొస్తే బిజెపికి ఓట్ షేర్ 45 శాతం ఉంటుందని కాంగ్రెస్ కు ఇక్కడ 39.5 శాతం ఉండొచ్చని, ఇతరులకు 15 శాతం ఓట్లు వస్తాయనీ తేల్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories