logo
జాతీయం

బీజేపీకి మరో ఝలక్‌..

బీజేపీకి మరో ఝలక్‌..
X
Highlights

గత నెలలో ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన తరువాత కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా బిహార్‌లోని మహాకూటమితో చేతులు ...

గత నెలలో ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన తరువాత కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా బిహార్‌లోని మహాకూటమితో చేతులు కలిపి బీజేపీకి ఉహించని భారీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతాదళ్‌, హిందూస్తాన్‌ అవామ్‌ మోర్చా భాగస్వాములుగా ఉన్న మహాకూటమిలో చేరుతున్నట్టు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో(ఏఐసీసీ) జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఉపెంద్ర కుష్వాహా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో నన్ను తీవ్రంగా అనుమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాకూటమి బలంతో వచ్చే ఏడాది ప్రధానిగా నరేంద్ర మోడీని భర్తీ చేయవచ్చని కుష్వాహా అన్నారు. కాగా, బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకాల విషయంలో లోక్‌ జనశక్తి(ఎల్‌జేపీ) కూడా తీవ్రఅసంతృప్తితో ఉందని త్వరలోనే రాంవిలాస్‌ పాశ్వాన్‌ కూడా బయటకు వస్తారని కుష్వాహా ప్రకటించడంతో అందరిలోనూ కలకలం రేపుతోంది.

Next Story