తెరపైకి.. శ్రీధర్‌బాబు కేసు

తెరపైకి.. శ్రీధర్‌బాబు కేసు
x
Highlights

మరో పాత కేసు తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ నాయకుడిని గంజాయి కేసులో ఇరికించడం కోసం సుదర్శన్ అనే కాంగ్రెస్ కార్యకర్త సాయం కోరిన వేళ, మాజీ మంత్రి, కాంగ్రెస్...

మరో పాత కేసు తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ నాయకుడిని గంజాయి కేసులో ఇరికించడం కోసం సుదర్శన్ అనే కాంగ్రెస్ కార్యకర్త సాయం కోరిన వేళ, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు బెదిరించారంటూ గతంలో కేసు నమోదు కాగా, ఇప్పుడా కేసులో స్వర నివేదిక ఇవ్వాలంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులను పోలీసులు కోరారు. పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామానికి చెందిన కిషన్‌రెడ్డి అనే టీఆర్ఎస్ నాయకుడిని గంజాయి కేసులో ఇరికించడం కోసం సుదర్శన్‌ అనే కాంగ్రెస్‌ కార్యకర్త మాజీమంత్రి శ్రీధర్‌బాబు సహాయం కోరాడు. ఈ అంశంపై శ్రీధర్‌బాబుతో జరిపిన ఫోన్‌ సంభాషణ మొత్తాన్ని సుదర్శన్‌ తన ఫోన్లో రికార్డు చేసి ఉంచాడు. ఇది తెలిసిన కిషన్‌రెడ్డి ఆ రికార్డును సంపాదించి హైదరాబాద్‌ చిక్కడపల్లిలో నివాసం ఉంటున్నందున అక్కడి పోలీసుస్టేషన్లో శ్రీధర్‌బాబుపై కొన్ని నెలల క్రితం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సంభాషణ శ్రీధర్‌బాబుదేనేనా? లేక మరెవరిదైనానా? తేల్చి చెప్పాలంటూ పోలీసులు కొన్ని నెలల క్రితం ల్యాబ్‌ అధికారులకు పంపించారు. ఆ నివేదిక సంగతి ఏమైందో చెప్పాలంటూ ఇటీవల మళ్లీ లేఖ రాయడంతో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories