Top
logo

కన్నతల్లిలాంటి టీడీపీని వీడటానికి కారణం ఇదే: ఎర్రబెల్లి

కన్నతల్లిలాంటి టీడీపీని వీడటానికి కారణం ఇదే: ఎర్రబెల్లి
X
Highlights

నియోజకవర్గ ప్రజల అభవృద్ధి కోసమే నేను కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరానని తాజా మాజీ...

నియోజకవర్గ ప్రజల అభవృద్ధి కోసమే నేను కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరానని తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పే మాటలు నమ్మి, ఓటును వృథా చేసుకోవద్దని ప్రజలను కోరారు. పెర్కవేడు, మైలారం, తిర్మలాయపల్లి గ్రామాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ...నాలుగున్నరేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకం నాకుందని ఎర్రబెల్లి అన్నారు.

Next Story