పాండ్యాతో డేటింగ్ స్పందించిన న‌టి

పాండ్యాతో డేటింగ్ స్పందించిన న‌టి
x
Highlights

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య- బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ కొద్దికాలంగా వార్తలు చక్కర్లు హంగామా చేస్తున్నాయి. దీనికితోడు...

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య- బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ కొద్దికాలంగా వార్తలు చక్కర్లు హంగామా చేస్తున్నాయి. దీనికితోడు హార్దిక్‌ బ్రదర్ కృనాల్‌ పాండ్య మ్యారేజ్‌కి హాజరైన ఎల్లీ, హార్దిక్‌ పక్కనే నిలబడి ఫొటోలకు పోజులిచ్చింది. ఇంకేముంది.. వీళ్లిద్దరు రేపోమాపో పెళ్లి చేసుకోవడం ఖాయమంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చివరకు ఈ గాసిప్స్‌పై స్పందించింది హీరోయిన్ ఎల్లీ.

‘నా విషయంలో ఎవరేమనుకున్నా నేను పట్టించుకుంటూ.. ప్రతీ దానికీ సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. హార్దిక్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంటరయ్యానంటే నాకు నేనే మరిన్ని పుకార్లు పుట్టించినట్లు అవుతుంది. గతంలో కూడా చాలాసార్లు నాపై చాలా రకాలుగా వార్తలొచ్చాయి. అయినా సెలెబ్రిటీలంటే అంతే.. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అలాగని అన్నీ పట్టించుకుంటే మా పని మేము చేసుకోలేం’ అని చెప్పింది ఆ నటీమణి.

Show Full Article
Print Article
Next Story
More Stories