నాలుగు లోక్‌సభ స్థానాల్లో మూడు చోట్ల బీజేపీకి ఎదురుగాలి..

4 లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కౌంటింగ్ శరవేగంగా సాగుతోంది. ఉదయం 8 గంటలకు ఓట్ల...
4 లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కౌంటింగ్ శరవేగంగా సాగుతోంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలి రౌండ్లలోనే బీజేపీకి గట్టి పోటీ ఎదురైంది. ఉత్తరప్రదేశ్ లో కీలకంగా భావించిన కైరానా నియోజకవర్గంలో ఆర్‌ఎల్డీ ముందంజలో ఉండగా, మహారాష్ట్రలోని పాల్ఘడ్‌లో విజయం బీజేపీని దోబుచులాడుతోంది. భండారా గోండియా నియోజక వర్గంలో బిజెపి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక నాగాలాండ్ లోక్ సభ స్థానంలో ఎన్.డి.పి.పి ఆధిక్యంలో కొనసాగుతోంది. కైరానా నియోజక వర్గంలో బిజెపికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం అయ్యాయి. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకి చెందిన తబస్సుమ్ హసన్, బిజెపి అభ్యర్ధి మృగాంక సింగ్ కన్నా ముందంజలో కొనసాగుతున్నారు. 7వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కర్ణాటక ఆర్‌ఆర్ నగర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. తొలిరౌండ్లోనే అక్కడి కాంగ్రెస్ అభ్యర్థికి 4వేలకు పైచిలుకు ఆధిక్యం దక్కింది. ఇక ఉత్తర ప్రదేశ్‌లోని నూర్పూర్ అసెంబ్లీ స్థానం నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మహేస్తల లో టీఎంసీ అభ్యర్థి ఆధిక్యం కనబరుస్తున్నారు. మహారాష్ట్రలోని పాలుస్ కడేగావ్ కు జరిగిన ఎన్నికల్లో విశ్వజిత్ పతంగరావు విజయం సాధించినట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇక్కడ పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి చివరి క్షణంలో వైదొలగడం, ఆయన మినహా మరొకరు నామినేషన్ వేయకపోవడంతో పతంగరావు ఎన్నిక ఏకగ్రీవమైంది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Heavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMTRajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
12 Aug 2022 1:00 PM GMTమునుగోడులో బీజేపీదే విజయం: డా.లక్ష్మణ్
12 Aug 2022 12:45 PM GMTDiabetes: చిన్న పిల్లల్లో విజృంభిస్తున్న మధుమేహం.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 12:30 PM GMT