బ్రేకింగ్ : బీజేపీకి ఎదురుదెబ్బ!

బ్రేకింగ్ : బీజేపీకి ఎదురుదెబ్బ!
x
Highlights

ఉప ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి పోరాటంతో బిజెపికి షాక్ తగిలింది. సిట్టింగ్ స్థానాలను సైతం కోల్పోయింది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం కాంగ్రెస్ రెండు...

ఉప ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి పోరాటంతో బిజెపికి షాక్ తగిలింది. సిట్టింగ్ స్థానాలను సైతం కోల్పోయింది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం కాంగ్రెస్ రెండు స్థానాలు కైవసం చేసుకోగ, సమాజ్ వాదీ పార్టీ, ఆర్.జె.డి లు చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. కర్ణాటకలోని రాజ రాజేశ్వరి నగర్, మేఘాలయలోని అపంటి స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. యూపీలో నూపుర్ అసెంబ్లీ స్థానాన్ని ఎస్పీ కైవసం చేసుకోగా .. బీహార్ లో జోకీహట్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్రీయ జనతాదళ్ అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించింది. ఈ స్థానంలో ఫలితం మొదట జెడిఎస్ కు అనుకూలంగా ఉన్నా చివరకు ఆర్జేడీనే విజయం వరించింది.

యూపీలో అత్యంతక కీలకమైన కైరానా స్థానాన్ని ఆర్.ఎల్.డి అభ్యర్ధి తబస్సుమ్ కైవసం చేసుకున్నారు. బిజెపి అభ్యర్ధి మృగాంకా సింగ్ చిత్తుగా ఓడిపోయారు. ఆర్.ఎల్.డి అభ్యర్ధి తబస్సుమ్ గెలుపుకు కూటమి పక్షాలన్నీ తోడ్పాటునందించాయి. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఆర్.ఎల్.డి అభ్యర్ధికి అండగా నిలిచాయి. దీంతో తబస్సుమ్ కు భారీ మెజార్టీ లభించింది.

భాండారా గోండియా లోక్ సభ నియోజక వర్గంలో బిజెపికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మధ్య హోరా హోరీ గా ఉంది. తుది ఫలితాలు మరొకొన్ని నిమిషాల్లో వెలువడనున్నాయి. పాల్ఘర్ లో బిజెపి స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. అదే విధంగా ఎన్.డి.ఎ మిత్ర పక్షమైన ఎన్.డి.పి.పి నాగాలాండ్ లోక్ సభ స్థానంలో పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది. కేరళలో చెంగన్నూర్ లో సిపిఎం విజయం సాధించింది. పశ్చిమబెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. జార్ఖండ్ లోని సిల్లి నియోజక వర్గంలో జెఎంఎం గెలుపొండగా .. గోమియాలో గెలుపు దిశగా వెళుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories