గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న మహాకూటమి..

గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న మహాకూటమి..
x
Highlights

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మహాకూటమి దూకుడు పెంచింది. ప్రచార హోరు మరింత పెంచేందుకు మహా నేతలను రంగంలోకి దింపుతోంది. ఈ నెల 28న ఖమ్మంలో చంద్రబాబు, రాహుల్...

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మహాకూటమి దూకుడు పెంచింది. ప్రచార హోరు మరింత పెంచేందుకు మహా నేతలను రంగంలోకి దింపుతోంది. ఈ నెల 28న ఖమ్మంలో చంద్రబాబు, రాహుల్ తో కలిపి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఒకే సభలో ఇరువురు నేతలు కలిసి పాల్గొనండంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నికల ప్రచారంలో మహాకూటమి స్పీడు పెంచింది. ఇప్పటి వరకు విడివిడిగా ప్రచారం నిర్వహించిన ప్రజాఫ్రంట్ భాగస్వామ్య పార్టీలు ఇక ఉమ్మడి ప్రచారంపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే మేనిఫెస్టోని ప్రకటించిన మహాకూటమి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, కాంగ్రెస్ అధినేత రాహుల్ తో ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం నుంచి ఇరువురి నేతల ప్రచారం ప్రారంభంకానుంది. ఒకే వేదికపై చంద్రబాబు, రాహుల్ కొలువుదీరనుండటంతో.. స్థానికులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈ నెల 28న ప్రజాకూటమి తరుపున ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో రాహుల్ గాంధితో పాటు ఏపీ సిఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ సభ కేంద్ర, రాష్ట ప్రభుత్వాల నిరంకుశ పాలనకు చెక్‌ పెట్టేందు నాందికానుందన్నారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. ప్రజాకూటమికి చెందిన అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు భార సంఖ్యలో పాల్గొనున్నారని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లను మహాకూటమి గెలుచుకుంటుందన్నారు నామా నాగేశ్వరరావు. టీడిపి, కాంగ్రెస్‌ పొత్తు ఒక హిస్టారికల్‌ వెంట్‌ అన్న నామా ప్రజాఫ్రంట్ విజయం ఖాయమన్నారు. మరోవైపు, గుంటూరు జిల్లా పర్యటించిన సీఎం చంద్రబాబు, తెలంగాణలో ఎన్నికలపై స్పందించారు. తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్‌ను ఓడించి ప్రజా కూటమిని గెలిపించాలన్నారు. టీఆర్ఎస్, వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాని బాబు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు జగన్, వపన్‌లు పరోక్షంగా మద్దతిస్తున్నారని విమర్శించారు. ఖమ్మం సభ అనంతరం, చంద్రబాబు, రాహుల్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించేలా మహాకూటమి ప్లాన్ చేస్తోంది. రోడ్ షోలతో పాటు మరికొన్ని బహిరంగ సభల్లో ఇరువురు నేతలు కలిసి పాల్గొనేందుకు ఇప్పటికే షెడ్యూల్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories