ఎన్నికల సిబ్బందిని విధులకు రంగం సిద్దం చేస్తున్నఈసీ

x
Highlights

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల సిబ్బంది నియామకంపై ఈసీ దృష్టిపెట్టింది. డిసెంబర్ 7వ తారీఖున జరిగే ఎలక్షన్స్ కోసం ఒక్కో పోలింగ్...

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల సిబ్బంది నియామకంపై ఈసీ దృష్టిపెట్టింది. డిసెంబర్ 7వ తారీఖున జరిగే ఎలక్షన్స్ కోసం ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు నలుగురు సిబ్బందిని నియమిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఎన్నికల సంఘం నియమించే సిబ్బంది తమ సొంత నియోజకవర్గాల్లో కాకుండా, ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల డ్యూటి చేయాల్సి ఉంటుంది.

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎలక్షన్ సిబ్బంది నియామకంపై దృష్టిపెట్టింది ఎలక్షన్ కమిషన్. రాష్ట్రంలో మొత్తం 32 వేల 574 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 217 కొత్త పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 32,851 కి చేరింది. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు నలుగురు చొప్పున సిబ్బందిని నియమిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. 32,851 పోలింగ్ స్టేషన్లకు నలుగురు చొప్పున సిబ్బందిని నియమిస్తే మొత్తం 1,31,404 మంది సిబ్బంది అవసరం అవుతారని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఎన్నికల డ్యూటీలో నియమించే సిబ్బందికి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఈసీ ప్రకటించింది. ఎన్నికల డ్యూటీ పడిన సిబ్బందికి జిల్లా కలెక్టర్లు ఆధ్వర్యంలో ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తామని ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపారు.

ఇక బందోబస్తు కోసం 70 వేల మంది పోలీసు బలగాలు అవసరమని ఎలక్షన్ కమిషన్ అంచనా వేసింది. 307 కేంద్ర బలగాలు కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్నికోరారు. కేంద్ర ఎన్నికల సంఘం 250 కేంద్ర బలగాలను తెలంగాణ రాష్ట్రానికి పంపు తున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపారు. ఈ 250 కేంద్ర బలగాలలో ఇప్పటికే 160 కేంద్ర పోలీస్ బలగాలు వరకు రాష్ట్రానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు.

మరోవైపు అన్ని జిల్లాల్లో హెలిప్యాడ్లను ఏర్పాటు చేయాలని డీజీపీని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఆదేశించారు. ఈ హెలిప్యాడ్‌లు అటు రాజకీయ పార్టీలకు ఇటు ఎన్నికల నిర్వహణ అధికారులకు ఉపయోగపడతాయని ఎలక్షన్ కమిషన్ తెలిపింది ఇంకోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్ లను ఉపయోగిం చనున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ జిల్లా పరిధిలో ఒక ఎయిర్ అంబులెన్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories