కోడ్‌ ఉల్లంఘిస్తే సీఆర్‌పీసీ, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు

x
Highlights

రాజకీయ పార్టీల నేతలు యథేచ్ఛగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తుండడం పట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ నిస్సహాయత వ్యక్తం చేశారు....

రాజకీయ పార్టీల నేతలు యథేచ్ఛగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తుండడం పట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం నోటీసులను బేఖాతరు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని అన్నారు. కోడ్‌ ఉల్లంఘనల కేసుల్లో చట్ట ప్రకారమే చర్యలుంటాయని చెప్పారు. ఎన్నిక నిర్వహణ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని ఎన్నిక ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. మొత్తం 3,583 నామినేషన్లు వచ్చాయని చెప్పారు. ఈ నెల 22 వ తేది వరకు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పోటి చేసే వారి తుది జాబితా వెల్లడిస్తామని తెలిపారు. కోడ్‌ ఉల్లంఘిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంతో పాటు సీఆర్‌పీసీ, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెడుతున్నామన్నారు. ఉల్లంఘనల తీవ్ర ఆరోపణలకు సంబంధించిన మరో 10 ఫిర్యాదులు తమ పరిశీలనలో ఉన్నాయన్నారు.

రాష్ట్రంలోని 119 శాసనసభ స్థానాలకు మొత్తం 3583 నామినేషన్లు వచ్చాయని, ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకారం మంగళవారం ఒక్క రోజులో నామినేషన్ల పరిశీలన పూర్తి చేయడం సాధ్యం కాదని రజత్‌కుమార్‌ తెలిపారు. నామినేషన్ల పరిశీలను బుధవారం పూర్తి చేసి అర్హులైన అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తామన్నారు. 23 నుంచి బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ ప్రారంభిస్తామన్నారు. 23 నుంచి ఓటరు స్లిప్పులు బూత్‌ లెవల్‌ అధికారులు ఈ నెల 23 నుంచి ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఓటరు స్లిప్పుల పంపిణీ చేయడం ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేస్తారన్నారు. కొత్త ఓటర్లకు 25 నుంచి నెలాఖరులోగా బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి ఓటరు గుర్తింపు కార్డు ల పంపిణీ చేస్తారన్నారు. రూ.25 చెల్లించి మీసేవా కేంద్రాల నుంచి ఎపిక్‌ కార్డులు పొందవచ్చు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories